Brain Eating Amoeba: రళలో కొత్త ప్రాణాంతక వ్యాధి కలకలం రేపుతోంది. “బ్రెయిన్ ఈటింగ్ అమీబా” అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ వ్యాధి Primary Amoebic Meningoencephalitis (PAM) వల్ల ఇప్పటికే 21 మంది మరణించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 80కి పైగా కేసులు నమోదయ్యాయి.
ఈ వ్యాధికి కారణం నీలినట్లో ఉండే సూక్ష్మజీవి అమీబా. ఇది నీటిలో ముక్కు ద్వారా శరీరంలోకి చేరి నేరుగా మెదడుకు చేరుతుంది. అక్కడి కణజాలాన్ని నాశనం చేస్తుంది. దీంతో తలనొప్పి, జ్వరం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది.
ఈ వ్యాధి వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించదు. కానీ అపరిశుభ్రంగా ఉన్న నిల్వ నీటిలో ఈ అమీబా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చెరువులు, తాగని నీరు, స్విమ్మింగ్ పూల్స్ వంటి చోట్ల అపాయం ఎక్కువ.
కేరళ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
నిల్వ నీటిలో స్నానం చేయరాదు
స్విమ్మింగ్ పూల్ నీటిని తరచూ మార్చాలి
నీటిలో స్నానం చేస్తున్నప్పుడు నాసికా క్యాప్స్ వాడాలి
శుభ్రతపై దృష్టి పెట్టాలి
ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సాధ్యం. ప్రజలు తలనొప్పి, జ్వరం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ప్రభుత్వం అన్ని వైద్య ల్యాబ్‌లలో పరీక్షల ఏర్పాట్లు చేసింది. నీటి శుద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు వివిధ మార్గాల్లో ప్రచారం చేస్తోంది.