Site icon HashtagU Telugu

Boy Friend On Rent: బెంగళూరులో అద్దెకు బాయ్ ఫ్రెండ్.. బట్ బిగ్ ట్విస్ట్!

Boy Friend

Boy Friend

అద్దెకు బాయ్‌ఫ్రెండ్ అనేది పాశ్చాత్య దేశాలలో ఓ ట్రెండ్. ఫారిన్ కంట్రీస్ గురించి ట్రెండ్ గురించి మనం చాలా వింటుంటాం. అయితే ఇండియాలోని ఐటీ రాజధాని బెంగళూరులో ఈ ట్రెండ్‌ కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. బెంగుళూరులో ఉన్న ఒక కొత్త స్టార్టప్ అద్దెకు బాయ్‌ఫ్రెండ్ కాన్సెప్ట్ చాలా మందిని ఆకర్షించింది. బాయ్‌ఫ్రెండ్‌లను గంట లెక్కన అద్దెకు ఇచ్చే స్టార్టప్‌ను ప్రారంభించేందుకు కొంతమంది టెక్కీలు స్టార్టప్ ను ప్రారంభించారు. అమ్మాయిలు ఇష్టపడే బాయ్‌ఫ్రెండ్స్‌ని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్. పనికి వచ్చే ప్రియుడు ఆ అమ్మాయిని శారీరకంగా కలవడు.. ఈ ట్విస్ట్ అనేక సందేహాలు రేకెత్తించడంతో స్టార్టప్ వ్యవస్థాపకులు ఇప్పుడు పెద్ద వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ToYBoY పోర్టల్ అనే స్టార్ట్-అప్ మానసిక సమస్యలు, డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తులు కొంత ఉపశమనం పొందే విధంగా పోర్టల్ పనిచేస్తుందని నిర్వాహకులు రియాక్ట్ అయ్యారు. అయితే సెక్సువల్ సర్వీస్ అందించే స్టార్టప్ కాదు అని తేల్చి చెప్పారు. స్టార్టప్‌ను ఏర్పాటు చేసిన టెక్కీలు తమ స్టార్టప్ మిగతా వాటి కంటే భిన్నంగా ఉందని, అమ్మాయిల సమస్యలను వినడమే కాకుండా సూచనల ద్వారా రిలీఫ్ ఇస్తామని అంటున్నారు.

డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ రకమైన సేవలు పొందినప్పటికీ, సర్వీస్ పట్ల తీవ్ర విమర్శలు కూడా ఉన్నాయి. అద్దెకు బాయ్‌ఫ్రెండ్ సేవలో ట్విస్ట్ ఉందని స్టార్టప్ వ్యవస్థాపకులు ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని ప్రజలు అడుగుతున్నారు. చాలా కారణాల వల్ల రాష్ట్రంలో స్టార్టప్ చర్చనీయాంశంగా మారింది. ఈ స్టార్టప్‌పై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Exit mobile version