కేరళ(Kerala)లో పదేళ్లలో పాగా వేయాలని లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఎల్లప్పుడూ LDF మరియు UDF మధ్యే రాజకీయ పోటీ ఉండగా, BJPకి పెద్దగా ప్రభావం చూపే అవకాశం కలగలేదు. కానీ, తాజాగా ఈ పరిస్థితిని మార్చేందుకు BJP ప్రత్యేకమైన వ్యూహాలపై దృష్టి సారిస్తోంది.
కేరళలో హిందువుల జనాభా 54 శాతం, ముస్లిములు 27 శాతం, క్రైస్తవులు 18 శాతంగా 2011 జనాభా లెక్కలు తెలుపుతున్నాయి. ఈ గణాంకాలను అనుసరించి, BJP ప్రధానంగా హిందూ, క్రైస్తవ సమాజాలపై ఫోకస్ పెట్టింది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) పాలన పట్ల అసంతృప్తి చెందుతున్న హిందూ, క్రైస్తవ వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. క్రైస్తవ మత పెద్దలతో కలిసి సమావేశాలు నిర్వహించడం, వారి సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కారాలు చూపించడం వంటి చర్యలు చేపడుతోంది. రీసెంట్ గా VATIKANలో జరిగిన జార్జ్ జాకబ్ కూవకడ్ కార్డినల్ వేడుకకు BJP బృందాన్ని పంపడం ఈ క్రమంలో కీలకమైన అడుగు.
ఈ వ్యూహం కేరళలో మతపరమైన సామరస్యాన్ని ప్రభావితం చేస్తుందా, లేదా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. అయితే, BJP తన యుద్ధ ప్రణాళికలో ఆర్ఎస్ఎస్ సహాయంతో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మద్దతు పొందడానికి ప్రయత్నిస్తోంది. ఈ విధానానికి మంచి ఫలితాలు రాకపోయినా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ గా చూస్తే BJP కేరళలో స్థిరపడటానికి దీర్ఘకాలిక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. స్థానిక సమస్యలు, మతపరమైన అంశాలను టార్గెట్ చేస్తూ, రాజకీయ లబ్ధి పొందాలని ఆశిస్తోంది. ఈ వ్యూహం ఎంత వరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉంది.
Read Also : TG Assembly : సీఎం రేవంత్ – అదానీ ఫొటోలతో టీషర్టులు.. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అరెస్ట్