UP civic body polls 2023: వారణాసి మేయర్ పీఠం బీజేపీదే

వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 40 శాతం ఓటింగ్ జరిగినా.. మరోసారి మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.

UP civic body polls 2023: వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 40 శాతం ఓటింగ్ జరిగినా.. మరోసారి మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి అశోక్ తివారీ రెండు లక్షల 91 వేల 852 ఓట్లతో విజయం సాధించారు. అశోక్ తివారీ రెండు లక్షల 91 వేల 852 ఓట్లు సాధించి, తన ప్రత్యర్థి ఎస్పీకి చెందిన డాక్టర్ ఓం ప్రకాష్ సింగ్ పై లక్షా 33 వేల 137 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఎస్పీకి చెందిన ఓమ్ ప్రకాష్ సింగ్‌కు లక్షా 58 వేల 715 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ విజయం ఏకపక్షం అయ్యింది. మొత్తం 27 రౌండ్ల కౌంటింగ్‌లో బీజేపీ సాధించిన ఓట్లను ఎస్పీ అభ్యర్థులు ఒక్కసారి కూడా టచ్ చేయలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ శ్రీవాస్తవ 94 వేల 288 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థికి ప్రతి వార్డులో ఓట్లు వచ్చాయి కానీ ఏ రౌండ్‌లోనూ ఎస్పీని వెనక్కి నెట్టలేకపోయారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేసిన శారదా టాండన్ 8077 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఓట్ల పరంగా ఎస్పీకు చెందిన ఆనంద్ కుమార్ తివారీ 12 వేల 799 ఓట్లతో ఆప్ కంటే ముందంజలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడమే కాకుండా 63 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో తొలిసారిగా 100 వార్డుల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చింది.

Read More: CYBER THUGS 100 CRORE : 28000 మందిని చీట్ చేసి..100 కోట్లు దోచారు