Site icon HashtagU Telugu

Karnataka Elections 2023: సోనియా గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

Karnataka Elections 2023

New Web Story Copy (86)

Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈరోజు చివరి రోజు. దీంతో రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలతో కర్ణాటక హోరెత్తిపోతుంది. ప్రతిపక్షాలు, అధికార పార్టీ నేతలు ఒకరినొకరు విమర్శ దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో హుబ్లీలో సోనియా గాంధీ ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఆమె సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించడంపై దుమారం చెలరేగింది. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీలు ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రతినిధి బృందం కలిసింది.

సోనియా గాంధీ కావాలనే సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉపయోగించారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పనికిమాలినదని అందుకే అలాంటి పదాలను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఈ చర్యపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే కూడా సోనియా గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హుబ్లీలో చేసిన ప్రసంగంలో సోనియా గాంధీ కర్ణాటక సార్వభౌమాధికారం గురించి మాట్లాడారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. సార్వభౌమాధికారం అనే పదాన్ని దేశానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఫిర్యాదు అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. ‘ఈరోజు మేము సోనియా గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాము. హుబ్లీలో ఆమె ప్రసంగిస్తూ కర్ణాటక సార్వభౌమాధికారం గురించి మాట్లాడారు. మేము దేశం కోసం సార్వభౌమాధికారాన్ని ఉపయోగిస్తాము. ఆమె ‘తుక్డే-తుక్డే’ ముఠాకు నాయకురాలు. అందుకే ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More: Jagan:అవినాష్ ఔట్‌!తెర‌పై దుష్య‌త్ రెడ్డి,అభిషేక్ రెడ్డి?