Bharatanatyam Dancer: కళకు ‘మతం’ రంగు!

ఆమె చిన్నప్పట్నుంచే కళలు అంటే అమితమైన ఆసక్తి. అందుకే ముస్లిం కుటుంబంలో జన్మించినా

  • Written By:
  • Updated On - March 29, 2022 / 12:22 AM IST

ఆమె చిన్నప్పట్నుంచే కళలు అంటే అమితమైన ఆసక్తి. అందుకే ముస్లిం కుటుంబంలో జన్మించినా భరతనాట్యం, ఇతర శాస్త్రీయ కళలను విడిచిపెట్టలేదు. కళే ప్రాణంగా బతుకుతున్న ఆర్టిస్ట్ పేరు మాన్సియా VP. ఆమెకు కళల్లో ఎంత ప్రావీణ్యం ఉందో.. అంతకుమించి బహిష్కరణ కు గురైంది కూడా. కారణం ఆమె హిందువు కాదు కాబట్టి. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న ఆలయ అధికారులు ఏప్రిల్ 21న ప్రదర్శనకే ఓకే చెప్పారు. కానీ మళ్లి వాళ్లను కలిస్తే.. నో చెప్పారు. అధికారులు ఇప్పటికే మరో ఆర్టిస్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. “నేను హిందువు కాదు కాబట్టే అధికారులు నా ప్రదర్శనను బహిష్కరించారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముస్లిం మతంలో పుట్టి పెరిగిన మహిళగా ఈమె ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది. మతం కారణంగానే బహిష్కరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. భరతనాట్యంలో పిహెచ్‌డి స్కాలర్ అయిన మాన్సియా చిన్నప్పటి నుండి బహిష్కరణను ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్నో కట్టుబాట్ల మధ్య పెరగాల్సిన అమ్మాయికి డాన్స్ ఎందుకు అంటూ మైనార్టీ వర్గం సైతం ఆంక్షలు విధించింది. అయినా ఆమె నాట్యాన్ని విడిచిపెట్టలేదు. 2007లో తల్లి అమీనా మరణించినప్పుడు, మాన్సియా ఆమె సోదరి రుబియా నృత్యకారులు అనే కారణంగా మసీదులో అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. చివరికి మేము నా తల్లిని ఆమె స్వస్థలంలో పాతిపెట్టాల్సి వచ్చింది” అని 2015లో మాన్సియా ఆవేదన వ్యక్తం చేసింది. కళలే ప్రపంచంగా బతికే నాలాంటి కళాకారులను ప్రభుత్వమే గుర్తించి ఆదుకోవాలని ఈ సందర్భంగా దీనంగా వేడుకుంటోంది.