Site icon HashtagU Telugu

Bengaluru-Hyd: త్వరలోనే రానున్న హైస్పీడ్ ట్రైన్.. కేవలం రెండున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు?

Semi High Speed Railway Track

Semi High Speed Railway Track

ప్రతిరోజు బెంగుళూరు,హైదరాబాదు లాంటి మహానగరాలలో పట్టణాల మధ్య వేలాది మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళు పని మీద బయటకు వెళ్లేవారు ఇలా నిత్యం మహానగరాళ్లు ఎంతో రద్దీగా ఉంటాయి. అయితే ఈ బెంగళూరు నుంచి హైదరాబాద్ కి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకోవాలి అంటే రోడ్డు,రైలు మార్గంలో దాదాపుగా 10 గంటల సమయం పైనే పడుతుంది. అయితే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న భారతీయ రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగిస్తూ దక్షిణాది ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు సెమీ హైస్పీడ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

అయితే ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుంది. కాగా ఇండియా ఇన్‌ఫ్రాహబ్‌ నివేదిక ప్రకారం.. సెమీ హైస్పీడ్‌ ట్రాక్‌ను గంటకు రూ.200 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లు దూసుకెళ్లే విధంగా నిర్మించబోతున్నారు. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 2.5 గంటలకు తగ్గనుంది. అయితే ఈ కొత్త ట్రాక్‌ను బెంగళూరు లోని యెలహంకా స్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌ వరకు సుమారు 503 కిలోమీటర్లు నిర్మించబోతున్నారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు.

కాగా ఇందుకోసం దాదాపుగా రూ.30వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అయితే ఈ హైస్పీడ్‌ ట్రాక్‌ నిర్మాణానికి కావాల్సిన రూట్‌ను ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ ట్రాక్‌కు ఇరువైపులా 1.5 మీటర్ల ఫెన్సింగ్‌ ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ట్రైన్‌ హైస్పీడ్‌తో దూసుకెళ్లనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు మధ్య రైలులో ప్రయాణించేందుకు సుమారు 10 నుంచి 11 గంటల సమయం పడుతోంది.

Exit mobile version