Beer Price Hike Alert: బీర్ ప్రియులకు షాకింగ్ న్యూస్. అక్టోబరు మొదటి వారం నుంచి బీరుల ధరల్లో పెరుగుదల (Beer Price Hike Alert) కనిపించనుంది. వాస్తవానికి మరోసారి బీరు ధరలను పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాదిన్నర కాలంలో బీర్ల ధరలు మారడం ఇది మూడోసారి. 2023 బడ్జెట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భారతదేశంలో తయారైన మద్యం ధరలను 20 శాతం, మరోసారి బీరు ధరలను 10 శాతం పెంచారు. ఇప్పుడు మరోసారి బీర్ల ధరలు పెరగనున్నాయి.
అక్టోబరు నుంచి బీర్ల ధరలను పెంచాలని ప్రతిపాదించిన ఎక్సైజ్ శాఖ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే ప్రీమియం, సెమీ ప్రీమియం నాణ్యమైన మద్యం ధరలను ఎక్సైజ్ శాఖ తగ్గించింది. ప్రభుత్వ నిర్ణయంపై బార్ ఓనర్స్ సంస్థ స్పందిస్తూ.. ఇలా బీర్ల ధరలు పెంచడం సరికాదన్నారు. గోధుమలు, బార్లీని ఉత్పత్తి చేసే రైతులకు బీర్ పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది కాబట్టి ప్రభుత్వం బీర్ అమ్మకానికి మద్దతు ఇవ్వాలి. త్వరలో ఒక్కో బాటిల్ రూ.10 నుంచి 20 వరకు పెరిగే అవకాశం ఉందన్నారు.
ఒక నివేదిక ప్రకారం.. బూమ్ స్ట్రాంగ్ ధర రూ.163 నుండి రూ.175 వరకు ఉండవచ్చు. బడ్‌వైజర్ మాగ్నమ్ ధరలు రూ. 213 నుండి 230 వరకు, బడ్‌వైజర్ ప్రీమియం రూ. 200 నుండి రూ. 215 వరకు, కింగ్‌ఫిషర్ ప్రీమియం రూ. 168 నుండి రూ. 180 వరకు, కింగ్‌ఫిషర్ స్టార్మ్ రూ. 177 నుండి రూ. 187 వరకు, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ ధర రూ.168 నుంచి రూ.180, కింగ్ ఫిషర్ అల్ట్రా ధర రూ.199 నుంచి రూ.220 వరకు ఉండవచ్చు. ట్యూబోర్గ్ స్ట్రాంగ్ ధర రూ. 168 నుండి 180 వరకు, UB ప్రీమియం ధర రూ. 131 నుండి 143 వరకు ఉండవచ్చు. యూబీ స్ట్రాంగ్ ధర రూ.131 నుంచి రూ.142గా ఉండవచ్చని అంచనా. ఇతర బ్రాండ్‌ల బీర్ ధరలు ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి 20 వరకు పెరిగే అవకాశం ఉంది.