Site icon HashtagU Telugu

Bear Falls Into Well: బావిలో పడిన ఎలుగుబంటి.. రెస్క్యూ చేసి కాపాడిన అధికారులు

Bear Falls Into Well

Resizeimagesize (1280 X 720) 11zon

వెల్లనాడ్ వద్ద ఓ బావి (Well)లో పడిన ఎలుగుబంటి (Bear)ని రక్షించేందుకు కేరళ అటవీ శాఖ అధికారులు ప్రయత్నించి సఫలం అయ్యారు. బుధవారం రాత్రి కన్నంపల్లికి చెందిన ప్రభాకరన్‌ అనే వ్యక్తికి చెందిన బావిలో ఎలుగుబంటి ప్రమాదవశాత్తు పడిపోయింది. ఎలుగుబంటి నీళ్లలో మునిగిపోకుండా ఉండేందుకు బావి గోడను పట్టుకుని పైకి వచ్చేందుకు ప్రయత్నించింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ మిషన్ కోసం వచ్చిన అధికారులు గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎలుగుబంటిని బావి నుంచి బయటకి తీసి కాపాడారు.

మొదట ఎలుగుని బయటికి తీయడానికి బావిలో తాడు నెట్‌ను అమర్చారు. కానీ ట్రాంక్విలైజర్ ప్రభావంతో ఎలుగుబంటి క్రమంగా జారిపడి మునిగిపోయింది. దింతో అధికారులు బావిలోని నీటిని బయటకు పంపింగ్‌ చేసి జంతువును బయటకు తీశారు. ఎలుగుబంటి పరిస్థితి ప్రస్తుతం ప్రాణపాయ స్థితిలో ఉంది. ఎలుగుబంటి ప్రభాకరన్ ఇంట్లో పెంచుతున్న కోళ్లను పట్టుకోవడానికి వచ్చినట్లు భావిస్తున్నారు. ఓ కోడిని పట్టుకునే ప్రయత్నంలో ఎలుగుబంటి బావిలో పడినట్లు అనుమానిస్తున్నారు. శబ్దం విని ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు అటవీశాఖకు సమాచారం అందించారు.

Also Read: Army Officer: ఈ డిగ్రీ ఉంటే.. మీరే ఆర్మీ ఆఫీసర్.. నెలకు రూ. 2.50 లక్షల జీతం

మరోవైపు.. కేరళలోని మలప్పురం జిల్లాలో బావిలో పడిన ఏనుగును అటవీశాఖ అధికారులు రక్షించారు. మలప్పురం జిల్లాలోని రబ్బరు తోటలో ప్రమాదవశాత్తు 15 అడుగుల లోతున్న బావిలో ఏనుగు పడిపోయింది. బావి నుంచి కేకలు రావడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది జేసీబీ సాయంతో ఏనుగును రక్షించారు. అప్పటికే అలసిపోయిన ఏనుగు అతికష్టమ్మీద అందులోంచి బయటపడింది.