Bangalore: బరితెగించిన కేటుగాళ్లు.. మహిళ లాయర్ ను దుస్తులు విప్పించి, ఆ తర్వాత ఏం చేశారంటే

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 08:47 PM IST

Bangalore: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సంబంధిత ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా కేసులకు పుల్ స్టాఫ్ పడటం లేదు. ఉన్నతవిద్యావంతులు సైతం నేరగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన సంచలనంగా మారింది.

బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారులమంటూ నిందితులు ఓ మహిళ లాయర్‌ను బెదిరించి రూ.10 లక్షలు దోచుకున్నారు. నార్కోటిక్ టెస్టులు పేరిట వీడియో కాల్‌లో ఆమెతో దుస్తులు తొలగింపచేసి వీడియో రికార్డు చేశారు. చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఏప్రిల్ 5న కొందరు ముంబై శాఖ కస్టమ్స్ అధికారులమంటూ ఆమెకు వీడియో కాల్ చేశారు.

ఆమె పేరిట సింగపూర్ నుంచి ఓ డ్రగ్స్ ప్యాకేజీ వచ్చిందని బెదిరించారు. నార్కోటిక్స్ టెస్టు పేరిట వీడియో కాల్‌లో ఆమెతో దుస్తులు తొలగింపచేసి వీడియో రికార్డు చేశారు. వీడియోను బహిర్గతం చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. దీంతో, బెదిరిపోయిన మహిళ నిందితులు కోరినట్టు రూ.10 లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది. ఆ తరువాత ఏప్రిల్ 7న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగుచూసింది.