Bangalore Airport: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్ పోర్ట్ కు అరుదైన గుర్తింపు

  • Written By:
  • Updated On - December 22, 2023 / 04:09 PM IST

Bangalore Airport: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయరెండో టర్మినల్‌ ‘ప్రపంచంలోని అతి సుందర విమానాశ్రయం’గా గుర్తింపు దక్కించుకుంది. రెండో టర్మినల్‌ లోపలి విన్యాసానికి యునెస్కోకు చెందిర ఫ్రిక్స్‌ వర్సైల్‌ సంస్థ ఈ గుర్తింపును ప్రకటించింది. విమానాశ్రయాల్లో సౌకర్యాలు, ఇంటీరియర్‌ డిజైన్, ఆర్కిటెక్చర్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విమానాశ్రయాలకు ఈ పురస్కారాలు, గుర్తింపును సంస్థ ఇస్తోంది. ఈ విభాగంలో పురస్కారాన్ని దక్కించుకున్న ఏకైక విమానాశ్రయంగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది.

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగుళూరులో గల అంతర్జాతీయ విమానాశ్రయము. 2008, మే 23వ తేదీన కర్ణాటక రాష్ట్రపు మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ప్రారంభించబడింది. బెంగళూరు నగరం నుండి సుమారు 32 కి.మీ.దూరంలో ఉన్న ఈ విమానాశ్రయానికి రహదారి మార్గాలు అనుసంధానమై ఉన్నాయి.

కెంపేగౌడ విమానాశ్రయం బెంగళూరులోని ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’కి సేవలు అందిస్తుంది. ఢిల్లీ విమానాశ్రయం మరియు ముంబై విమానాశ్రయం తర్వాత బెంగళూరు విమానాశ్రయం భారతదేశంలో మూడవ అతిపెద్ద విమానాశ్రయం. ఇది 2022లో స్కైట్రాక్స్ ద్వారా ‘భారతదేశం మరియు మధ్య ఆసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం’ అవార్డును కూడా పొందింది.