ఇటీవల ఓ కార్యక్రమంలో తమిళనాడు నేత ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) సనాతన ధర్మం మీద మాట్లాడుతూ సనాతన ధర్మం నిర్మూలన జరగాలని, దేశంలో ప్రజలను పట్టిపీడించే దీర్ఘరోగాలైన డెంగీ, కలరా, మలేరియా లాంటి వాటిని ఎలాగైతే నిర్మూలించాల్సిన అవసరం ఉందో, సనాతన ధర్మాన్ని(Sanathana Dharma) కూడా వేళ్ళతో సహా సమూలంగా నిర్మూలించాలని అతను వ్యాఖ్యానించాడు.
దీంతో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపాయి. ఎన్నోలక్షల సంవత్సరాలుగా భారతదేశం అంటేనే సనాతన ధర్మం అని వస్తున్న తరుణంలో దేశంలో దాదాపు 80 కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తుండగా ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సామాన్య ప్రజలు, నాయకులు, ప్రముఖులు, నెటిజన్లు ఉదయనిధిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉదయనిధి కాంగ్రెస్ కూటమిలో కూడా ఉండటంతో బీజేపీ(BJP) నాయకులు మరింత ఫైర్ అవుతున్నారు.
తాజాగా తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్(Bandi Sanjay) ఈ విషయంలో ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం జోలికొస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సనాతన ధర్మాన్ని అంతమొందించాలని ప్రయత్నించిన వాళ్లు సమాధుల్లో ఉన్నారు. ఔరంగాజేబుల్ మొదలుకొని బ్రిటిష్ వాళ్ల వరకు వాళ్లే కనుమరుగయ్యారు. ఇస్లాంకు వ్యతిరేకంగా నుపూర్ శర్మ, రాజాసింగ్ మాట్లాడారు అని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే సంకలు గుద్దుకున్న పార్టీలు ఇవన్నీ. ఈయన తాత.. రాముడు ఇంజనీరా అని మాట్లాడినాడు, ఇప్పుడు మనవడు సనాతర ధర్మాన్ని అంతమొందిస్తా అంటున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడింది సోనియాగాంధీ కొడుకు అయినా స్టాలిన్ కొడుకు అయినా ఒక్కటే. ఉదయ్ నిధి స్టాలిన్ మాట్లాడిన మాటలపైన I.N.D.I.A కూటమి తమ స్టాండ్ ఏంటో చెప్పాలి. I.N.D.I.A కూటమి తమ స్టాండ్ చెప్పకపోతే చరిత్రలో తప్పు చేసిన వారిగా మిగిలిపోతారు అని అన్నారు.
ఇక ఉదయనిధి స్టాలిన్ పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. I.N.D.I.A కూటమి ఇప్పుడిప్పుడే బలపడుతున్న సమయంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేసి చాలా పెద్ద తప్పు చేశాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read : MLC Kavitha: సోనియా గాంధీకి కవిత సూటి ప్రశ్న, కాంగ్రెస్ వైఖరిపై ధ్వజం