Site icon HashtagU Telugu

Bengaluru Floods: బెంగుళూరును ముంచిన అవినీతి, అస‌మ‌ర్థ పాల‌న

Bengaluru Rains Imresizer

Bengaluru Rains Imresizer

భారీ వర్షాల కారణంగా బెంగళూరులో సంభవించిన విధ్వంసం, చెడు పాలన, అధిక అవినీతి, పట్టణ సంస్కరణల లోపం కార‌ణంగా జ‌రిగింద‌ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ ప్రముఖుడు TV మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయ‌ప‌డ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించడంపై ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్పందించారు. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు విఫలమయ్యార‌ని ట్వీట్ చేశారు. అసమర్థ ప్రభుత్వం, చెడ్డ పాలన, అధిక అవినీతి ఫలితం. అధిక అవినీతి, కార్పొరేషన్‌లో సామర్థ్యం లేకపోవడం, అక్రమ నిర్మాణాలు, నాసిరకం పనులు త‌దిత‌రాల ఫ‌లితంగా భార‌త్ సిలికాన్ వ్యాలీ మునిగిపోయింద‌ని అన్నారు. .ఇది గత 30 ఏళ్లలో నగరాలన్నింటిలో పట్టణ సంస్కరణల లోపాన్ని చూపిస్తుంద‌న్నారు.