Site icon HashtagU Telugu

Baby injured: పిల్లాడిపై కోడిపుంజు దాడి.. ఓనర్‌పై కేసు నమోదు..!

Cock

Cock

పిల్లాడిపై కోడిపుంజు దాడి చేయడంతో దాని ఓనర్‌పై పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ ఘటన కేరళ ఎర్నాకుళం మంజుమ్మల్‌లో జరిగింది. రెండేళ్ల పిల్లాడి కళ్ల కింద, బుగ్గలపై, చెవి వెనక, తల వెనక కోడిపుంజు బలంగా దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాబును మంజుమ్మల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లాడి కంటిచూపుపై ప్రభావం పడే అవకాశముందని డాక్టర్లు తెలిపారు.

కేరళలోని ఏర్నాకుళం, మంజుమ్మల్‌‌లోని ముత్తార్ కడవ్‌లో ఓ పిల్లాడిపై కోడి పుంజు దాడి చేసింది. అయితే పిల్లాడిని తీసుకొని, అతని తల్లి పక్కింటికి వెళ్లింది. ఇక ఆ ఇంటి బయట పిల్లాడిని ఉంచి ఇంటిలోపలికి వెళ్లింది. దీంతో పిల్లాడు గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. వచ్చి చూసేసరికి, పిల్లాడిపై కోడి దాడి చేయడంతో, అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్ల కింద, బుగ్గలపై, తల వెనకబాగం బలంగా కోడి పుంజు దాడి చేసింది. దీంతో వెంటనే పిల్లాడి తంల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా, కంటి చూపుపై ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కోడి పుంజు యజమానిపై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతని కోడి వలన నా పిల్లాడికి తీవ్రగాయాలు అయ్యాయి అని కేసు పెట్టారు. దీంతో కోడి ఓనర్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.