Trisha : పెద్ద మనసు చేసుకొని నన్ను క్షేమించు – అన్నాడీఎంకే నేత

మీడియాలో పాపులర్ కావాలని ఓ బురద చల్లేయడం..ఆ తర్వాత క్షేమపణలు కోరడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినీ తారల విషయంలో రాజకీయ నేతలకు ఇదో అలవాటుగా మారింది. పబ్లిక్ లో హీరోయిన్ల ఫై అభ్యకరమైన కామెంట్స్ చేసి పరువు తీయడం.. ఆ తర్వాత క్షేమపణలు చెప్పడం ఎక్కువుతుంది. We’re now on WhatsApp. Click to Join. తాజాగా త్రిష ఫై అన్నాడీఎమ్కే పార్టీ నుండి బహిష్కరించబడిన ఏవీ రాజు (AIADMK leader AV Raju) కీలక […]

Published By: HashtagU Telugu Desk
Trisha

Trisha

మీడియాలో పాపులర్ కావాలని ఓ బురద చల్లేయడం..ఆ తర్వాత క్షేమపణలు కోరడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినీ తారల విషయంలో రాజకీయ నేతలకు ఇదో అలవాటుగా మారింది. పబ్లిక్ లో హీరోయిన్ల ఫై అభ్యకరమైన కామెంట్స్ చేసి పరువు తీయడం.. ఆ తర్వాత క్షేమపణలు చెప్పడం ఎక్కువుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా త్రిష ఫై అన్నాడీఎమ్కే పార్టీ నుండి బహిష్కరించబడిన ఏవీ రాజు (AIADMK leader AV Raju) కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గతంలో త్రిష గౌవత్తూరులో జరిగిన ఓ వేడుకకు హాజరైంది. అక్కడి ఎమ్మెల్యే ఆమె మీద మనసు పడ్డాడు. రూ. 25 లక్షలు తీసుకుని త్రిష ఆయనతో ఒక రాత్రి గడిపింది. అందుకు నేనే సాక్ష్యం అని రాజు కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ఫై పెద్ద ఎత్తున దుమారం రేగడం తో..తనను క్షేమించు అని త్రిష ను కోరారు రాజు. తాను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదని, తన మాటలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. త్రిష న్యాయపోరాటానికి సిద్ధం కావడం, రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి విమర్శలు రావడంతో రాజు దిగి వచ్చినట్లు తెలుస్తుంది.

సినీ నటి త్రిష (Trisha)..ఈ మధ్య సినిమా వార్తల కన్నా వివాదాస్పద వార్తలతో హైలైట్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య నటుడు మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan) త్రిషను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపాయో తెలియంది కాదు.. లియో చిత్రంలో త్రిష హీరోయిన్ గా చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ విలన్ రోల్ చేశాడు. త్రిష హీరోయిన్ అని చెప్పడంతో ఆమెతో రేప్ సీన్ ఉంటుంది. ఆమెను బెడ్ రూమ్ లోకి తీసుకెళతానని ఆశపడ్డాను. కానీ లియో సెట్స్ లో త్రిషను నాకు అసలు చూపించనేలేదు… అని మీడియా ముందు చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడెప్పుడు ఈయన చేసిన కామెంట్స్ అభిమానులు మరచిపోతున్న తరుణంలో ఇప్పుడు రాజు త్రిషను ఉద్దేశిస్తూ చేసిన జుగుప్సాకరమైన కామెంట్స్ తో మరోసారి త్రిష వార్తల్లో నిలిచేలా అయ్యింది.

Read Also :  Best Tourist Places In Telangana : తెలంగాణలో ఈ ప్రదేశాలకు వెళ్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు..

  Last Updated: 22 Feb 2024, 01:33 PM IST