తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం కార్పోరేషన్ కి మొదటి మేయర్ గా ఆటోడ్రైవర్ శరవణన్ బాధ్యతలు స్వీకరించారు. కుంభకోణంలో 20 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్‌గా ఆయన పని చేశారు. తాను ఇప్పటికీ ప్రజల్లో ఒకడినే అనే సందేశాన్ని అండర్‌లైన్ చేయాలని కోరుతూ, శరవణన్ శుక్రవారం తన ఆటోరిక్షాపై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు.
రాష్ట్రంలోని అధికార డిఎంకె 21 కార్పొరేషన్లలో 20 కార్పొరేషన్లకు పార్టీ నుండి అభ్యర్థులను ప్రతిపాదించింది, ఒక మేయర్ పదవిని కాంగ్రెస్‌కు కేటాయించింది. ఈ పదవి చాలా మంది సీనియర్ పార్టీ కార్యకర్తల్లో ఒకరికి వస్తుందని భావించినప్పటికీ, కాంగ్రెస్ హైకమాండ్ శరవణన్‌ను మేయర్ గా ఎంపిక చేసింది. ఇటీవల కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన కుంభకోణం మొదటి మేయర్ కూడా శరవణన్. టెంపుల్ సిటీలోని 17వ వార్డులో జరిగిన పోలింగ్‌లో మొత్తం 2,100 ఓట్లకు గాను 964 ఓట్లు సాధించి శరవణన్ విజేతగా నిలిచాడు.