Site icon HashtagU Telugu

Onam Bumper Lottery : అదృష్టం అంటే నీదే గురు.. లాట‌రీలో కోటీశ్వ‌రుడైన‌.. ?

Auto Driveronam Bumper Lottery Imresizer

Auto Driveronam Bumper Lottery Imresizer

అదృష్ట ల‌క్ష్మీ ఓ ఆటో డ్రైవ‌ర్ ఇంటి త‌లుపు త‌ట్టింది. కుటుంబ పోషణ నిమిత్తం విదేశాలకు వెళ్లే పనిలో ఉన్నా ఆటో డ్రైవ‌ర్‌ సరదాగా లాటరీ టికెట్‌ కొన్నాడు. అయితే 24 గంటలు గడిచిలోగా అతడి సుడి గిరా గిరా తిరిగిపోయింది. 500 రూపాయలు పెట్టి లాటరీ టికెట్‌ కొంటే.. ఏకంగా 25 కోట్లు తగిలాయి. దాంతో అతడి ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఓనం బంపర్‌ లాటరీలో ఏకంగా 25 కోట్ల రూపాయలు గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు ఓ ఆటో డ్రైవర్‌… ఇంత‌కీ ఆ ఆటో డ్రవ‌ర్ ఎవ‌రో తెలుసుకుందాం.. !

కేరళ రాష్ట్రంలోని శ్రీవరాహం ప్రాంతానికి చెందిన అనూప్ ఆటో డ్రైవర్‌గా జీవ‌నం సాగిస్తున్నాడు. ఆ ఆటో తోలుకుంటే వ‌చ్చే డ‌బ్బుతోనే ఆయ‌న త‌న కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ ఆదాయం స‌రిపోక‌పోవ‌డంతో అనూప్ విదేశాల‌కు వెళ్లి అక్క‌డే ఏదో ఒక ప‌ని చేసి ఎక్కువ డ‌బ్బులు సంపాదించి ఇక్క‌డ కుటుంబ స‌భ్యుల‌కు పంపాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కొన్ని రోజుల క్రితమే అతడికి మలేషియాలో చెఫ్‌గా ప‌ని చేసేందుకు అవ‌కాశం ల‌భించింది.

ఈ క్రమంలో అక్కడకు వెళ్లడం కోసం బ్యాంక్‌ రుణం కూడా మంజూరు అయ్యింది. మరి కొన్ని రోజుల్లో మలేషియా వెళ్లాల్సి ఉండగా.. అనూహ్యంగా లాటరీలో 25 కోట్ల రూపాయలు గెలుచుకుని అనూప్ కోటీశ్వరుడయ్యాడు. అయితే ఈ 25 కోట్ల రూపాయాల్లో అనూప‌ప్‌కి మాత్రం 15 కోట్లు రూపాయ‌లు మాత్ర‌మే చేతికి రానున్నాయి. ఎందుకంటే ట్యాక్స్‌లు పోనూ చివ‌రికి రూ.15 కోట్లు ఆటో డ్రైవ‌ర్‌కు వస్తాయి. దీనిపై ఆటో డ్రైవ‌ర్ అనూప్ స్పందించారు. త‌న‌కు లాట‌రీ త‌గ‌ల‌డం చాలా సంతోషంగా ఉంద‌ని.. వ‌చ్చిన డ‌బ్బుల‌తో అప్పులు చెల్లించి.. ఇక్క‌డే ఎదైనా వ్యాపారం చేసుకుంటాన‌ని ఆయ‌న తెలిపారు.

Exit mobile version