Site icon HashtagU Telugu

Peafowls: కోయంబత్తూరులో దారుణం.. విషప్రయోగంతో 31 నెమళ్లు మృతి

Peacock

Peacock

Peafowls: కోయంబత్తూరులోని సుల్తాన్‌పేటైలో వ్యవసాయ భూముల్లో 31 నెమళ్లు చనిపోయాయి. పక్షులకు విషప్రయోగం చేసి ఉండొచ్చని అటవీశాఖ ప్రాథమిక విచారణలో తేలింది. సుల్తాన్‌పేటై సమీపంలోని గాంధీనగర్‌లోని వ్యవసాయ భూముల్లో పెద్ద సంఖ్యలో నెమళ్లు చనిపోయాయని సుల్తాన్‌పేట పోలీసులు మదుక్కరై ఫారెస్ట్ రేంజ్‌లోని అధికారులను అప్రమత్తం చేశారు. మదుక్కరై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి సంధియా నేతృత్వంలోని బృందం నలుగురు రైతులకు చెందిన భూముల్లో 31 పక్షుల కళేబరాలను గుర్తించింది.

వారు మృతదేహాలను మదుక్కరై ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. కోయంబత్తూరులోని జిల్లా అటవీ అధికారి (DFO) N జయరాజ్ మాట్లాడుతూ “మేం పక్షుల నమూనాలను చెన్నైలోని ఒక ల్యాబ్‌కి మరియు సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ (SACON)కి కూడా పంపాం. నివేదిక అంచనా ప్రకారం పక్షులకు విషం ఇచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది.