Police Officer: కోచీలో తన వాకింగ్ కోసం రోడ్డునే బ్లాక్ చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్

జనం ఎలా పోతే వారికేంటి.. సార్లు మాత్రం వాకింగ్, జాగింగ్ చేసుకోవడానికి అస్సలు డిస్టబెన్స్ ఉండకూడదు.

  • Written By:
  • Updated On - June 18, 2022 / 08:30 PM IST

జనం ఎలా పోతే వారికేంటి.. సార్లు మాత్రం వాకింగ్, జాగింగ్ చేసుకోవడానికి అస్సలు డిస్టబెన్స్ ఉండకూడదు. అందుకే వాళ్లు అలా చేసే ప్రాంతమంతా ఖాళీ చేయిస్తారు. అవసరమైతే రోడ్లు, స్టేడియంలు అన్నీ బ్లాక్ చేసేస్తారు. ఆమధ్య ఐఏఎస్ దంపతులు తమ శునకంతో వాకింగ్ చేయడం కోసం.. ఢిల్లీలో ఓ మైదానాన్నే ఖాళీ చేయించారు. ఇప్పుడు కేరళలోని ఓ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాకింగ్ కోసం.. రోడ్డును మూసేస్తున్నారు.

కోచిలోని క్వీన్ వాక్ వే అంటే తెలియనివారు ఉండరు. ఎందుకంటే అక్కడ రోజూ వాకింగ్, జాగింగ్ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. ఈ వాక్ వే పక్కనే రోడ్డు ఉంటుంది. ఇక ఆదివారాల్లో అయితే పిల్లలు.. సైక్లింగ్, స్కేటింగ్ చేసుకోవడం కోసం.. ఈ రోడ్డును కొద్దిసేపు మూసేస్తారు కూడా. అలా వారానికి కొద్ది సేపు అయితే ఓకే.. కానీ ఈమధ్య కొన్నిరోజులుగా ఈ రోడ్డు రోజూ కాసేపు మూసే ఉంటోందంటున్నారు స్థానికులు. దానికి కారణం తెలిసి పోలీసు అధికారులే ఆశ్చర్యపోయారు.

వినోద్ పిళ్లై.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వెస్ట్. ఈ సార్ కి మార్నింగ్ వాకింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే రోజూ ఉదయం పూట కనీసం రెండుమూడు గంటలైనా సరే.. క్వీన్ వాక్ వేను మూసేస్తారు. ఎందుకంటే అంటే.. ఆ మార్గంలో ఆయనకు వాకింగ్ చేస్తారు. అందుకే వాహనాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డును బ్లాక్ చేసేవారు. ట్రాఫిక్ ను మళ్లించేవారు.

వినోద్ పిళ్లై వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో వాళ్లు ఎంక్వయిరీ చేశారు. అది నిజమే అని తేలడంతో నోటీసులు ఇచ్చారు.