షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ కి బెయిల్ దొరికి జైలు నుండి విడుదలయ్యారు.
26 రోజుల జైలు జీవితం అనుభవించిన ఆర్యన్ ఆర్థర్ జైలు నుండి బయటకొచ్చారు. తన కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి షారుక్ ఆర్ధర్ జైలుకు వెళ్లారు.
ఆర్యన్ కి కోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. ఆ కండిషన్స్ ఏంటంటే
Here he is! #AryanKhan is finally released from the jail. pic.twitter.com/476bFJI49n
— BombayTimes (@bombaytimes) October 30, 2021
ఆర్యన్ ఖాన్ విదేశాలకు వెళ్లకుండా వెంటనే తన పాస్పోర్ట్ స్పెషల్ కోర్టుకి సబ్మిట్ చేయాలి.ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే స్పెషల్ కోర్టు అనుమతి తీసుకోవాలి.
తన ప్రస్తుత నివాస స్థలం ముంబాయి కాకుండా దేశంలోని ఇతర ప్రదేశాలకి వెళ్లాలంటే ఇన్వెస్టిగేటివ్ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.
కేసు విచారణలో ఉన్నది కాబట్టి ఈ కేసుకు సంబందించిన విషయాలను మీడియాతో గానీ సోషల్ మీడియాలో గానీ ప్రస్తావించకూడదు.
ఈ కేసుతో నేరుగా లేదా ఇండైరెక్ట్ గా సంబంధం ఉన్న ఎవరితోనూ ఎలాంటి కమ్యూనికేషన్ చేయకూడదు.
ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల లోపు ముంబాయి లోని ఎన్సీబీ ఆఫీసులో సంతకం పెట్టాలి.
వీటితో పాటు కేసును నీరుగార్చే ప్రయత్నం, పక్కదారి పట్టించే ప్రయత్నం, సాక్షులను ప్రలోభపెట్టడం, భయపెట్టడం లాంటి చర్యలకు పాల్పడకూడదు.
పై వాటిల్లో ఏ ఒక్కటి అతిక్రమించినా ఆర్యన్ బెయిల్ వెంటనే రద్దయిపోయి మళ్ళీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
#WATCH Aryan Khan released from Mumbai's Arthur Road Jail few weeks after being arrested in drugs-on-cruise case pic.twitter.com/gSH8awCMqo
— ANI (@ANI) October 30, 2021