Site icon HashtagU Telugu

Karnataka: కాంగ్రెస్ పాదయాత్రపై కర్ణాటక హైకోర్టు సీరియస్!

Kartnataka

Kartnataka

మేకేదాటు ప్రాజెక్టుపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేస్తున్న పాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేయడం లేదని కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది. కోవిడ్-19 మార్గదర్శకాల్లో భాగంగా ర్యాలీలకు అనుమతి ఉండదని, పాదయాత్రకు ఎలా అనుమతి ఇచ్చారో, కోవిడ్‌ సంఖ్య పెరిగిన నేపథ్యంలో కెపిసిసి మార్గదర్శకాలు జారీ చేసినపుడు పాదయాత్రను నిర్వహించకుండా అధికారులు ఎందుకు తగిన చర్యలు ఎందుకో తీసుకోలేదో వివరించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బెంగళూరుకు చెందిన నాగేంద్ర ప్రసాద్ ఏవీ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూ రాజ్ అవస్తీ, జస్టిస్ సూరజ్ గోవిందరాజ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ర్యాలీలు, సభలు, సమావేశాలను స్పష్టంగా నిషేధించినప్పటికీ.. రాజకీయ ర్యాలీని ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా వ్యవహరించడాన్ని పిటిషనర్ ప్రశ్నించారు. ర్యాలీని కొనసాగించడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొనడంతో బెంచ్ అత్యవసర ప్రాతిపదికన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.