తిరుమ‌ల ల‌డ్డూపై ఏపీ సీఎం జ‌గ‌న్ క‌న్ను.. దేవాల‌యాల‌న్నీ ఇక తిరుమ‌ల మోడ‌ల్

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో వివాద‌స్ప‌మైన డైరెక్ష‌న్ దేవాదాయ స‌మీక్ష‌లో ఇచ్చాడు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌సాదం మాదిరిగా అన్ని దేవాయాల్లో ఉండాల‌ని ఆదేశించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

  • Written By:
  • Publish Date - September 30, 2021 / 03:06 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో వివాద‌స్ప‌మైన డైరెక్ష‌న్ దేవాదాయ స‌మీక్ష‌లో ఇచ్చాడు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌సాదం మాదిరిగా అన్ని దేవాయాల్లో ఉండాల‌ని ఆదేశించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌పంచంలోని ఏ దేవాల‌యానికి లేని పేటెంట్ హ‌క్కును తిరుమ‌ల ల‌డ్డూకు ఉంది. అలాంటి ల‌డ్డు త‌యారీ ప్ర‌క్రియ‌ను మిగిలిన దేవాల‌యాల్లో అనుస‌రించాల‌ని జ‌గ‌న్ ఆదేశించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తిరుమ‌ల తిరుప‌తి ప్రాశ‌స్త్యంపై ఆయ‌న‌కు అవ‌గాహ‌న లేదా? ఉండి కూడా అలా ఆదేశాలు జారీ చేశారా? అనేది ఇప్పుడు భ‌క్తుల్లోనూ, పూజాలు, దేవాల‌యాల నిర్వాహ‌కుల్లోనూ చ‌ర్చ న‌డుస్తోంది.
దేవాదాయాశాఖ మంత్రి, ఉన్న‌తాధికారుల‌తో నిర్వ‌హించిన సీఎం స‌మీక్ష‌లో ప‌లు అంశాల‌పై జ‌గ‌న్ డైరెక్ష‌న్స్ ఇచ్చారు. ఏపీలోని మిగిలిన దేవాల‌యాలు అన్నీ తిరుమ‌ల మాదిరిగా ఆన్ లైన్ విధానాన్ని పాటించాలని ఆదేశించారు. ప్ర‌సాదం స‌ర‌ఫ‌రాను కూడా తిరుమ‌ల‌లో మాదిరిగా చేయాల‌ని వివ‌రించారు. ఇక నుంచి అన్నీ దేవాల‌యాలు తిరుమ‌ల‌ను మోడ‌ల్ గా తీసుకుని ప‌నిచేయాల‌ని ఆర్డ‌ర్ వేశారు. విరాళాలను ఆన్ లైన్ ద్వారా మాత్ర‌మే ఇవ్వాల‌ని సూచించ‌డం కూడా మ‌రో వివాదం అవుతోంది. కొంద‌రు వ్యాపారులు భారీ విరాళాల‌ను ఆన్ లైన్ ద్వారా ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ప‌రిమిత విరాళాల‌ను మాత్ర‌మే ఆన్ లైన్ ప‌ద్ధ‌తి ద్వారా ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా విరాళాలు త‌గ్గే అవ‌కాశం లేక‌పోలేదు. ఇక దేవాల‌యాల ఆదాయాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డానికి లేద‌ని, పాద‌ర్శ‌కంగా ఉండాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఇంకో వైపు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆదాయాన్ని ఏపీ ప్ర‌భుత్వం ఇత‌ర అవ‌స‌రాల‌కు వాడుకుంటోంది. దానికి జ‌గ‌న్ ఏం చెబుతార‌ని భ‌క్తులు ప్ర‌శ్నిస్తున్నారు.
వంశ‌పారంప‌ర్య అర్చ‌కుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ ఎత్తివేసిన విష‌యాన్ని గుర్తు చేస్తూ,అర్చ‌కుల‌కు జీతాల‌ను పెంచాల‌ని ఆదేశించారు జ‌గ‌న్. అంతేకాదు, మొద‌టిసారిగా విజ‌య‌వాడ దుర్గ‌గుడి అభివృద్ధి కోసం 70 కోట్ల‌ను ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. గ‌దులు, ప్ర‌సాదం, ద‌ర్శ‌నం త‌దిత‌ర సేవ‌ల‌ను ఆన్ లైన్ చేయాల‌ని ఆదేశించారు. దేవాదాయ‌శాఖ‌లోని అంద‌రూ ఈవోల‌కు తిరుమ‌ల ఆన్ లైన్ ప‌ద్ద‌తుల‌పై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వాల‌ని జ‌గ‌న్ సూచించారు. భ‌ద్ర‌త కోసం సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. అర్చ‌కుల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఆదేశించ‌డం కొస‌మెరుపు.