Jagan: నేడు విశాఖ‌కు ఏపీ సీఎం.. శార‌దాపీఠం వార్షికోత్స‌వంలో పాల్గోన‌నున్న జ‌గ‌న్‌

శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నం వెళ్లనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ys Jagan66

Ys Jagan66

శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నం వెళ్లనున్నారు. సీఎం రాక సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి శారదా పీఠం వరకు భద్రతా సిబ్బంది కాన్వాయ్‌తో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో నేరుగా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వార్షిక ఉత్సవాల్లో పాల్గొని..అక్క‌డి నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. శ్రీ శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాజశ్యామల యాగంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గత కొన్నేళ్లుగా విశాఖపట్నం శ్రీ శారదా పీఠం వార్షిక ఉత్సవాలకు సీఎం జగన్‌ నిత్యం హాజరవుతున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యే అదీప్ రాజ్, నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

  Last Updated: 09 Feb 2022, 10:15 AM IST