Bhagavad Gita: హిజాబ్ తరువాత కర్ణాటకలో మరో హాట్ టాపిక్.. స్కూళ్లలో భగవద్గీత బోధనపై…!

  • Written By:
  • Publish Date - March 19, 2022 / 09:43 AM IST

స్కూళ్లలో భగవద్గీత బోధనాంశం మరోసారి చర్చకు వచ్చింది. స్కూళ్లలో దీనిని బోధించాలని చాలామంది కోరుతున్నా.. మతపరమైన గ్రంథమని కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. కానీ గుజరత్ ప్రభుత్వం మాత్రం దీనిని పట్టించుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి భగవద్గీతను మోరల్ సైన్స్ రూపంలో పిల్లలకు చెప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులుక దీనిని బోధిస్తారు. కర్ణాటక కూడా ఇదే రూటులో ఉంది.

6-8 తరగతుల విద్యార్థులకు శ్లోకాల రూపంలో గీతను బోదిస్తారు. అదే 9-12 తరగతుల విద్యార్థులకు మాత్రం కథల రూపంలో గీతను చెబుతారు. కాకపోతే ఇది ఫస్ట్ లాంగ్వేజ్ గా పుస్తకం రూపంలో ఉంటుంది. ఇప్పటికే ఈ విషయాన్ని గుజరాత్ విద్యాశాఖా మంత్రి జితు వాఘాని అసెంబ్లీలోనే చెప్పారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే బాట పట్టింది. గుజరాత్ లాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తోంది.

ఈమధ్యకాలంలో పిల్లల్లో సాంస్కృతిక విలువలు తగ్గిపోతున్నాయి. అందుకే వారిలో ఆ విలువలను పెంపొందించాలంటే దానికి తగిన పాఠ్యాంశాలను బోధించాలి. ఇప్పటికే ఈ విషయాన్ని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అందుకే దీనిపై విద్యానిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు కర్ణాటక విద్యాశాఖా మంత్రి బి.సి.నగేశ్. గతంలో మోరల్ సైన్స్ లో భాగంగా రామాయణం, మహాభారతం వంటిని నేర్పించినా.. కాలక్రమంలో వాటిని ఆపేశారన్నారు..

కర్ణాటకలో మరో మంత్రి బీసీ పాటిల్ మాత్రం రామాయణం, భగవద్గీత, మహాభారతం, ఖురాన్, బైబిల్ లో ఉన్న నైతిక అంశాల్లో నీతిశాస్త్రాన్ని బోధించడానికి తాము సిద్ధమే అనడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వం చెప్పాలనుకుంటోంది భగవద్గీతనా.. లేక పవిత్ర గ్రంథాల్లోని నైతిక విలువలతో కూడిన నీతినా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నాయి.