Annamalai : అన్నామలైకు కేంద్రమంత్రి పదవి.. పీఎంఓ పిలుపు

అన్నామలై.. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఈయన ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 

  • Written By:
  • Updated On - June 9, 2024 / 12:57 PM IST

Annamalai : అన్నామలై.. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఈయన ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.  ఆ స్థానంలో డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్‌ 1,18,068 ఓట్ల మెజారిటీతో అన్నామలైపై గెలిచారు. అయినప్పటికీ ఓ గొప్ప ఆఫర్ అన్నామలైకు లభించబోతోంది. ఆయనకు కేంద్రమంత్రి పదవిని ఇచ్చేందుకు ప్రధాని మోడీ రెడీ అవుతున్నారు. ఇవాళ ఉదయమే ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి అన్నామలై‌కు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీకి వచ్చి ప్రధాని మోడీని కలవాలని పీఎంఓ అధికారులు సూచించారు. దీంతో వెంటనే అన్నామలై చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు జరిగిన ప్రత్యేక భేటీలో అన్నామలై పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ సందర్భంగా ఆయనకు కేటాయించనున్న కేంద్రమంత్రి పదవిపై సమాచారాన్ని అందించారని వినికిడి.  ఒకవేళ అదే నిజమైతే ఇవాళ రాత్రి మిగతా కీలక నేతలతో పాటు అన్నామలై కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ నున్నారు.

We’re now on WhatsApp. Click to Join

లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై(Annamalai) ఓడిపోయినందున.. కేంద్ర మంత్రి పదవిని చేపట్టాక ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉంది. ఇక 11.30 గంటలకు జరిగిన పీఎంవో ప్రత్యేక భేటీలో రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, సర్బానంద సోనోవాల్, ప్రహ్లాద్ జోషి, అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ అందుకున్న నాయకుల జాబితాలో ఎల్‌జేపీ నాయకుడు చిరాగ్ పాస్వాన్, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా ఉన్నారు.

Also Read : China – Pak : కశ్మీర్‌పై విషం కక్కిన పాక్, చైనా.. సంయుక్త ప్రకటనతో కలకలం

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎల్‌ మురుగన్‌కు అప్పట్లో ఏర్పడిన ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రి పదవిని కేటాయించారు. ఇదే తరహాలో ప్రస్తుతం తమిళనాడులో పార్టీ బలోపేతానికి వీరోచితంగా శ్రమిస్తున్న అన్నామలైను గుర్తిస్తూ కేంద్ర మంత్రి పదవిని కేటాయించనున్నారు. ఇక అదే సమయంలో అన్నామలై తీరు వల్లే అన్నాడీఎంకేకు దూరమయ్యామని..  కలిసి కట్టుగా పోటీచేసి ఉంటే కనీస స్థానాలలో గెలిచి ఉండేవాళ్లమని పలువురు తమిళనాడు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Also Read :Chandrababu : కేసరపల్లిలో జోరుగా చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..