Viral Tweet : ఇడ్లీ ఏటీఎంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్..టేస్ట్ ఎలా ఉందంటూ…!!

ఇడ్లీ ఏటీఎం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కర్నాటకలోని బెంగుళూరులో ఒక స్టార్టప్ కంపెనీ ఈ ఇడ్లీ ఏటీఎంను ఏర్పాటు చేసింది.

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 04:44 AM IST

ఇడ్లీ ఏటీఎం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కర్నాటకలోని బెంగుళూరులో ఒక స్టార్టప్ కంపెనీ ఈ ఇడ్లీ ఏటీఎంను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఈ ఏటిఎంను చూసిన జనాలు అశ్చర్యపోతున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ ఏటీఎం గురించి తెలుసుకున్నారు. ఇడ్లీలు ఎలా ఉన్నాయి… టేస్ట్ ఎలా ఉందంటూ బెంగుళూరు ప్రజలను ప్రశ్నించారు ఆనంద్ మహీంద్రా.

ఇడ్లీ ఏటీఎంకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారాయన. చాలామంది రోబోటిక్ ఫుడ్ ప్రిపరేషన్, వెండింగ్ మెషీన్లకోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. దీనిలో పదార్థాలు తాజాగా ఉన్నాయని తేలింది. ఈ మెషీన్ లోని ఇడ్లీల టేస్ట్ ఎలా ఉంది. వరల్డ్ వైడ్ గా ఉన్న ఎయిర్ పోర్టు, షాపింగ్ మాల్స్ లో ఇలాంటి ఇడ్లీ ఏటీఎం పెడితే బాగుండు అంటూ చెప్పుకొచ్చారు ఆనంద్ మహీంద్రా.

కాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఫ్రెషప్ రోబోటిక్స్ ఇన్ స్టెంట్…ఈ ఇడ్లీ తయారీ యంత్రాన్ని రూపొందించింది. 24గంటలూ వేడివేడి ఇడ్లీలు అందించే ఈ ఏటీఎంను ఫ్రెషాట్ లో ఏర్పాటు చేశారు. ఇందులో నుంచి చట్నీ, కారంపొడితోపాటు ఇడ్లీలను ప్యాక్ చేసి కస్టమర్లకు అందిస్తోంది.