Older man Relationship: పనిమనిషితో సెక్స్ చేస్తుండగా వృద్ధుడి మృతి!

బెంగళూరులో రోడ్డు పక్కన లభ్యమైన 67 ఏళ్ల వృద్ధుడి మృతదేహం కలకలం రేపుతోంది.  

Published By: HashtagU Telugu Desk

Crime

బెంగళూరులో రోడ్డు పక్కన లభ్యమైన 67 ఏళ్ల వృద్ధుడి మృతదేహం కలకలం రేపుతోంది.  మృతిపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆయన తన ఇంటి పనిమనిషితో సెక్స్ చేస్తున్నప్పుడు మరణించాడని తేలిందని పోలీసులు తెలిపారు. ప్రేమికురాలైన ఇంటి పనిమనిషి ఆమె భర్త, సోదరుడి సహాయంతో ఆ వ్యక్తి మృతదేహాన్ని బెడ్‌షీట్‌, ప్లాస్టిక్‌ కవర్‌తో కప్పి ఉంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడతామన్న భయంతోనే రోడ్డు పక్కన పడేశామని నిందితులు అంగీకరించారు. పోలీసు వివరాల ప్రకారం.. జె.పి.నగర్‌కు చెందిన బాలసుబ్రమణ్యం మృతదేహాన్ని నవంబర్ 17న రోడ్డు పక్కనే స్వాధీనం చేసుకున్నారు.

ఆయన తన మనవడితో కలిసి బయటకు వెళ్లాడు. అతడిని బ్యాడ్మింటన్‌ క్లాస్‌కి దింపిన తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కనిపించడం లేదని సుబ్రమణ్యనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని కదలికలను ట్రాక్ చేయగా అతను తన ప్రియురాలి ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. సెక్స్‌లో ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో గుండెపోటుతో చనిపోయాడు. బాధితుడికి గతేడాది యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  Last Updated: 25 Nov 2022, 02:14 PM IST