Site icon HashtagU Telugu

Tamil PM: రాజకీయ మైలేజ్ కోసమే ‘తమిళ ప్రధాని’ తెరపైకి?

Amit Shah

Abolish Muslim Reservation If Comes To Power.. Amit Shah Sensational Announcement

Tamil PM: తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన తమిళుడే భారత ప్రధాని కావాలని సంచలన కామెంట్స్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో షా ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.

తమిళనాడు పర్యటనలో అమిత్ షా రెండు రోజుల పాటు పర్యటన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన డీఎంకే పార్టీని టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. దివంగత నేత ఎం. కరుణానిధిపై విమర్శలు గుప్పించిన షా, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె. కామరాజ్, జి.కె. మూపనార్‌కు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా.. కరుణానిధి వారి అవకాశాలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఇదే క్రమంలో అమిత్ షా కాంగ్రెస్-డీఎంకే కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబంలోని మూడు తరాలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రతిష్టను పెంచిందని, అయితే ఈ రెండు పార్టీలు తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునేందుకు పనిచేశాయని ఆరోపించారు.

ఇదిలా ఉండగా అమిత్ షా రాజకీయ లబ్ది పొందేందుకే తమిళ ప్రధాని ఇష్యూ లేవనెత్తారని అంటున్నారు డీఎంకే నేతలు. ఇది డీఎంకేను కార్నర్ చేసే ఎత్తుగడగా భావిస్తున్నారు. నిజానికి తమిళనాడుతో పాటు పుదుచ్చేరి నుంచి మొత్తం 39 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామని డీఎంకే ఇటీవలే ప్రకటించింది. ఈ సమయంలో అమిత్ షా చేసిన ‘తమిళ ప్రధాని’ వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా మారనున్నాయని అభిప్రాయపడుతున్నారు రాజకీయ నిపుణులు.

కాంగ్రెస్ మరియు డిఎంకె 2G, 3G మరియు 4G పార్టీలుగా అభివర్ణించారు. నేను 2G స్కామ్ గురించి మాట్లాడటం లేదు… ఇక్కడ 2G అంటే 2 తరాలు, 3G అంటే 3 తరాలు, 4G అంటే 4 తరాలుగా విభజిస్తూ వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. మురసోలి మారన్ కుటుంబం 2G అని వారి కుటుంబం రెండు తరాలుగా అవినీతిలో కూరుకుపోయిందని, కరుణానిధి కుటుంబం 3జీ అని వాళ్ళ కుటుంబం మూడు తరాలు అవినీతిలో కూరుకుపోయాయని.. గాంధీ కుటుంబం 4జీ అని, రాహుల్ గాంధీ 4వ తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని హాట్ కామెంట్స్ కు పాల్పడ్డారు షా.

Read More: 2 Lakh Crores : 2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం పగ్గాలు నాలుగో కొడుకుకు