Site icon HashtagU Telugu

Amalapuram Normal: కోనసీమలో ప్రశాంత పరిస్థితులు-ఏపీ డీజీపీ

Konaseema

Konaseema

ఏపీలోని కోనసీమ జిల్లా పేరు మార్పు తీవ్ర ఉద్రిక్తతకు దారి విషయం తెలిసిందే. కొనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఆందోళనకారులు విధ్వాంసానికి తెరలేపారు. ప్రస్తుతం అమలాపురంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఏడు కేసులలో మొత్తం 40మంది అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇద్దరు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో రెండు వేల మంది పోలీసులు మోహరించినట్లు చెప్పారు.

అయితే మంగళవారం జరిగిన హింసాకాండకు అసలు కారణమేంటన్న విషయాన్ని విచారిస్తున్నట్లు చెప్పారు. సీసీఫుటేజీ, ఇతర ఆధారాలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. దోషులను ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని డీజీపీ తెలిపారు. కాగా బుధవారం అమలాపురం, రావులపాలెం, అంబాజీపేట, కండ్రిగ వంటి ప్రాంతాల్లో ఆందోళనకారులు ధర్నాలు చేసేందుకు ప్రత్నించగా పోలీసులు వారి అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన యువకులును పోలీసులు ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ యువకులు నినాదాలు చేశారు. పోలీసులను చూసి చాలా మంది యువకులు తాము వచ్చిన బైకులను రోడ్లపైన్నే వదిలేసి పరారయ్యారు.