Site icon HashtagU Telugu

Pushpa In Chennai:మనసులో మాటను బయటపెట్టిన బన్ని… డ్యాన్స్ లో తనకి నచ్చిన హీరోలు వీల్లేనట

allu arjun

allu arjun

పుష్ప చిత్రం ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ముమ్మరంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హీరో అల్లు అర్జున్ చెన్నైలో పుష్ప ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రసంగం తమిళంలోనే సాగింది.
బన్నీ పెరిగింది చెన్నైలోనే కావడంతో తమిళంలో అనర్ఘళంగా మాట్లాడగలరు. ప్రెస్ మీట్లోనూ ఎక్కడ తడబాటు లేకుండా తమిళంలో మాట్లాడారు.

తన చిత్రాలు బాలీవుడ్ లోనూ డబ్ అవుతుంటాయని, అయితే తమిళనాడులో మంచి నటుడిగా గుర్తింపు పొందాలన్నది తన కోరిక అని తెలిపారు. తన సినిమాలు తమిళనాడులోనూ విజయం సాధించాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. పుష్ప చిత్రంతో తన ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తున్నానని, ఈ సినిమా పాటలు తమిళనాడు ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. తన ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు ఇచ్చారని, అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

తన ప్రసంగం తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పారు. మీరు మంచి డ్యాన్సర్ కదా, తమిళంలో మీకు నచ్చిన డ్యాన్సర్ ఎవరు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, పాతతరంలో కమల్ హాసన్ సర్ అద్భుతమైన డ్యాన్సర్ అని బన్నీ కొనియాడారు. ఆ తర్వాతి తరంలో విజయ్, ఇప్పుటి జనరేషన్ లో ధనుష్, శింబు, ఇతర యువ హీరోలంతా మంచి డ్యాన్సర్లేనని ఆయన పేర్కొన్నారు. తాను తమిళ సినిమాలు కూడా చూస్తుంటానని తెలిపారు. ఇటీవల శివకార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ చిత్రాన్ని చూశానని, బాగా నచ్చిందని వెల్లడించారు.

Exit mobile version