Exit Polls: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు కీలకం

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది.

  • Written By:
  • Updated On - November 1, 2021 / 12:18 AM IST

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. అభ్యర్థుల అదృష్టం ఈవీఎం బాక్సుల్లో ఉంది. ముప్పై మంది అభ్యర్థులు బరిలో నిలవగా పోటీ మాత్రం మూడు ప్రధానపార్టీల మధ్యే సాగింది. ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ బీజేపీ మద్యే నిజమైన పోటీ అని చెప్పొచ్చు.

ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీకే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలన్నీ ఈటల వైపే ఓట్లు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నాయి.
గత ఎన్నికలతో పోల్చితే ఈ ఉపఎన్నికల్లో ఎక్కువగానే పోలింగ్ నమోదైంది. ఈ భారీ ఓటింగ్ ఈటెలకే కలిసొచ్చినట్లు కనిపిస్తున్నది. తాజా సర్వేలను ఒకసారి పరిశీలిస్తే

కౌటిల్య సొల్యూషన్స్:

బీజేపీ 47శాతం
టీఆర్ఎస్ 40 శాతం
కాంగ్రెస్ 8 శాతం
ఇతరులు 5శాతం

మిషన్ చైతన్య:

బీజేపీ 59.20శాతం
టీఆర్ఎస్ 39.26 శాతం
కాంగ్రెస్ 0.69 శాతం
ఇతరులు 0.85శాతం

నాగన్న ఎగ్జిట్ పోల్స్:

బీజేపీ 42.90 నుంచి 45.50 శాతం
టీఆర్ఎస్ 45.30 నుంచి 48.9 శాతం
కాంగ్రెస్ 2.25 నుంచి 4 శాతం
ఇతరులు 5.51 నుంచి 6.50 శాతం

పొలిటికల్ ల్యాబొరేటరీ:

బీజేపీ 51శాతం
టీఆర్ఎస్ 42 శాతం
కాంగ్రెస్ 2నుంచి 3 శాతం
విదుర రీసెర్చ్ ఏజెన్సీ

మిషన్ చైతన్య:

బీజేపీ 58.42శాతం
టీఆర్ఎస్ 32.29 శాతం
కాంగ్రెస్ 16.32 శాతం
ఇతరులు 2.97శాతం

మూర్తి ఆత్మసాక్షి గ్రూపు హైదరాబాద్:

బీజేపీ 50.05శాతం
టీఆర్ఎస్ 43.01 శాతం
కాంగ్రెస్ 5.7 శాతం
ఇతరులు 0.7శాతం

పై విధంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఉన్నప్పటికీ ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ నుండి కొందరు వ్యక్తులు తమ ప్రయివేట్ వాహనాలలో ఈవీఎం బాక్సులను తరలించారని కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ఆరోపించి స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరసన తెలియచేసారు.

ఇక నవంబర్ 2న ఏం జరుగుతుందో? మానిప్యులేషన్ గేమ్ లో ఎవరు సక్సెస్ అయ్యి విజేతగా నిలుస్తారో చూడాలి.