Site icon HashtagU Telugu

Gold Smuggling: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్ ఇండియా ఉద్యోగి

Gold Smuggling

Resizeimagesize (1280 X 720) (1)

ఎయిర్ ఇండియాకు చెందిన సిబ్బంది ఒకరు బంగారం స్మగ్లింగ్‌ (Gold Smuggling)కు పాల్పడి కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. వాయనాడ్‌కు చెందిన షఫి అనే ఉద్యోగి సుమారు కిలోన్నర బంగారం పేస్ట్‌ను తన చేతులకు చుట్టుకుని బహ్రెయిన్ నుంచి కోజికోడ్‌కు చేరుకున్నారు. ముందస్తు సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు షఫిని తనిఖీలు చేశారు. అతడి వద్ద బంగారం లభించడంతో అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని కొచ్చి విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై బుధవారం కొచ్చి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వాయనాడ్‌కు చెందిన షఫీ అనే వ్యక్తిని 1 కిలో 487 గ్రాముల బంగారంతో కొచ్చిలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Sukma Encounter: సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు నక్సలైట్లకు గాయాలు

బహ్రెయిన్-కోజికోడ్-కొచ్చి సర్వీసులో క్యాబిన్ క్రూ సభ్యుడు షఫీ బంగారం తీసుకెళ్తున్నట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్‌కు రహస్య సమాచారం అందింది. నిందితుడు తన చేతుల్లో బంగారం చుట్టి, చొక్కా చేతికి కప్పుకుని గ్రీన్ ఛానల్ గుండా వెళ్లాలని ప్లాన్ చేశాడు. అతడిని మరింత లోతుగా విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.