Site icon HashtagU Telugu

AIMIM: త‌మిళ‌నాడులో ఖాతా తెరిచిన ఎఐఎం

Aimim Tamilnadu

Aimim Tamilnadu

తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు ప‌దేళ్ళ త‌ర్వాత జ‌రిగిని సంగ‌తి తెలిసిందే. గ‌త శ‌నివారం రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగ‌గా, ఈరోజు ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో త‌మిళనాడు లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్‌లో అధికార డీఎంకే పార్టీ స‌త్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కంచుకోటగా భావించే పశ్చిమ తమిళనాడు ప్రాంతంలోనూ అధికార డీఎంకే పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఒక్క మునిసిపాలిటీలో మాత్రమే ఆధిక్యంలో ఉందని తెలుస్తోంది. పట్టణ పంచాయతీల్లో కూడా డీఎంకే హవా స్పష్టంగా కనిపిస్తోంది. లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ జ‌రిగిన 21 కార్పొరేషన్‌లలో అన్నింటినీ డీఎంకే కూటమి కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు 138 మున్సిపాలిటీలకుగానూ 134 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో ఉందని అక్క‌డి మీడియా తెలిపింది. 489 స్థానాలకు గానూ 435 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

ఈ ఫలితాల్లో ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపు దిశగా సాగుతోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 1,373 కార్పొరేషన్ వార్డుల్లో డీఎంకే కూటమి 1,050 వార్డుల్లో, అన్నాడీఎంకే కూటమి 153 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మ‌రోవైపు తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఊహించ‌ని రిజ‌ల్ట్స్ వ‌చ్చాయి. వాణియంబాడీ మున్సిపాలిటీలోని మొత్తం 16 వార్డులు ఉండ‌గా, అందులో ఎంఐఎంప పార్టీ 2 వార్డుల‌ను కైవ‌సం చేసుకుంది.

ఈ క్ర‌మంలో వార్డు నంబర్ 19లో పోటీ చేసిన‌ నబీలా 50.46 శాతం ఓట్లు సాధించి గెలుపొంద‌గా, నాలుగో వార్డులో పోటీ చేసిన‌ నెమతుల్లా 34.10 శాతం ఓట్లుతో గెలుపొందారని, ఎంఐఎం నేత‌లు తెలిపారు. దీంతో ఎంఐఎం అభ్య‌ర్ధుల‌ను గెలిపించినందుకు, తమిళనాడు ఎంఐఎం అధ్యక్షుడు వకీల్ అహ్మద్ అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ధన్యవాదాలు తెలిపారు. గ‌త కొన్నేళ్ళుగా ప‌లు రాష్ట్రాల్లో పార్టీని విస్త‌రించేందు ఎంఐఎం ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడులో జ‌ర‌గిన గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగినా, ఖాతా తెవ‌లేక‌పోయింది. అయితే స్థానిక ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్న ఎంఐఎం రెండు స్థానాల్లో విజ‌యం సాధించింది.

ఇక‌పోతే ఎంఐఎం పార్టీకి దేశ వ్యాప్తంగా ఇద్ద‌రు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యే ఉన్నారు. మ‌హారాష్ట్ర‌లో ఒక‌రు, తెలంగాణ‌లో మ‌రోక‌రు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇక‌ తెలంగాణలో 7మంది ఎమ్మెల్యేలు, బీహార్‌లో 5మంది ఎమ్మెల్యే, మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గుతున్న నేప‌ధ్యంలో దాదాపు 100 స్థానాల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేయ‌నుంది. ఈ క్ర‌మంలో ఆ పార్టీ అధినేత ఒవైసీ అస‌దుద్దీన్ యూపీలో హోరాహోరీగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. దీంతో యూపీలో ఖాతా తెర‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో త‌మిళ‌నాడులో జ‌ర‌గిన స్థానికి ఎన్నిక‌ల్లో రెండు వార్డుల్లో గెల‌వ‌డం, ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.

Exit mobile version