Site icon HashtagU Telugu

Jayalalithaa : ఏఐతో జయలలిత ఆడియో సందేశం.. ఏముందో తెలుసా ?

Jayalalithaa

Jayalalithaa

Jayalalithaa : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 76వ జయంతి సందర్భంగా ఆమె గొంతుతో ఆడియో సందేశం విడుదలైంది. ఏడేళ్ల క్రితమే అనారోగ్యంతో జయలలిత కన్నుమూశారు. అలాంటిది ఆమె ఆడియో సందేశం ఇవ్వడం ఏమిటనే డౌట్ వచ్చిందా ? మరేం లేదు.. జయలలిత ఆడియో సందేశాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ మాయాజాలంతో అన్నాడీఎంకే పార్టీ తయారుచేసింది. ఈ సందేశాన్ని శనివారం అన్నాడీఎంకే అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతమిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

We’re now on WhatsApp. Click to Join

అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడులో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ ఆడియో సందేశంలో జయలలిత (Jayalalithaa) ప్రస్తావించారు. ప్రజాపాలన స్థాపనలో భాగంగా ఎడప్పాడి పళనిస్వామికి మద్దతు ఇవ్వాలని తమిళ ప్రజలను కోరారు. ‘‘నేను ప్రజల వల్లే ఉన్నాను.. నేను ప్రజల కోసమే ఉన్నాను’’  అనే పదబంధాన్ని తరుచూ ప్రసంగాల్లో జయలలిత వాడేవారు. దాన్ని కూడా ఈ ఆడియో సందేశంలో ప్రస్తావించడం విశేషం. ఈ సందర్భంగా అన్నా డీఎంకే పార్టీ సార్వత్రిక ఎన్నికల నినాదం ‘‘తమిళ హక్కులను తిరిగి పొందుదాం.. తమిళనాడును కాపాడుకుందాం’’ను మాజీ సీఎం పళనిస్వామి రిలీజ్ చేశారు.

Also Read : YS Sharmila : షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. హాజరైన ప్రముఖులు వీరే

‘‘హలో.. నేను మీ జే.జయలలితను మాట్లాడుతున్నాను.. మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించిన ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. మా పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. మేము అధికారంలో ఉన్నప్పుడు మహిళలు, విద్యార్థినుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం… ఇప్పుడు ఒక వైపు మనకు ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం.. నా పుట్టినరోజు సందర్భంగా, అన్నాడీఎంకే ‘ప్రజా ప్రభుత్వం’ మళ్లీ రావాలని మిమ్మల్ని కోరుతున్నాను.. మా కార్యకర్తలు నా బాటలో నిలబడాలి.. సోదరుడు ఎడప్పాడి పళనిస్వామికి మద్దతుగా ఉండాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. నేను ప్రజల వల్ల, ప్రజల కోసమే ఉన్నాను’’ అని ఆడియో సందేశంలో జయ చెప్పుకొచ్చారు.

Also Read : Seat Belt : బస్సులు, భారీ వాహనాల్లోనూ సీట్‌ బెల్ట్‌ మస్ట్.. ఎందుకు ?