Site icon HashtagU Telugu

Tamil Nadu Politics : అన్నాడీఎంకేలో నాయ‌క‌త్వ సంక్షోభం

Panniru Selvam Jayalaliyha

Panniru Selvam Jayalaliyha

త‌మిళ‌నాడు అన్నాడీఎంకే పార్టీలో ఏక‌నాయ‌క‌త్వ డిమాండ్ పెరిగింది. ప‌న్నీ సెల్వం, ప‌ళ‌నీ స్వామి నాయ‌క‌త్వాల న‌డుమ క్యాడ‌ర్ విసిగిపోయింది. ఇద్ద‌రూ ఆధిప‌త్య‌పోరు కొనసాగుతోంది. ఫ‌లితంగా ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం మొత్తం 23 ప్రతిపాదిత తీర్మానాలను తిరస్కరించింది. జాయింట్ కోఆర్డినేటర్ ఎడప్పాడి కె పళనిస్వామికి అనుకూలంగా ఏక‌ నాయకత్వ వ్యవస్థను తీసుకురావడమే GC సభ్యుల ఏకైక డిమాండ్ అని ప్రకటించింది.

గందరగోళం మ‌ధ్య గురువారం పార్టీ స‌మావేశం ప్రారంభమైన వెంటనే తీర్మానాల ఆమోద ప్రక్రియ చేపట్టారు. వాటిలో మొదటిది కోఆర్డినేటర్ ఓ పన్నీర్‌సెల్వం ప్రతిపాదించగా, పళనిస్వామి బలపరిచారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సీనియర్ నాయకుడు సి వీ షణ్ముగం అన్ని తీర్మానాలను “జనరల్ కౌన్సిల్ తిరస్కరించింది” అని ప్రకటించారు. ప్రతిపాదిత 23 తీర్మానాలను జిసి సభ్యులందరూ తిరస్కరించారని డిప్యూటీ సెక్రటరీ కెపి మునుసామి తెలిపారు. ఒకే నాయకత్వానికి అనుకూలంగా (ఈపీఎస్‌కు అనుకూలంగా) తీర్మానం ఆమోదించిన త‌రువాత భవిష్యత్తులో ఇతర తీర్మానాలు ఆమోదిస్తామ‌ని జీసీ ప్ర‌క‌టించింది.

అంతకుముందు, ఓ పనీర్‌సెల్వం , EPS మద్దతుదారులు ప్రత్యర్థి నినాదాలు చేస్తూ పోటీప‌డ్డారు. పార్టీ సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, పళనిస్వామి సభా వేదిక ప్రాంగణంలోకి ప్రవేశించగానే మద్దతుదారులు వారికి స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. ‘ఒట్రై తలమై వెండుమ్’ (మాకు ఒకే నాయకత్వం కావాలి) అంటూ OPSకి వ్యతిరేకంగా నినాదాలు కొంద‌రు చేశారు. దీంతో ఆందోళనలకు దారితీసింది. OPS తన మద్దతుదారులతో వేదికపైకి ప్రవేశించిన త‌రువాత EPS నాటకీయ ప్రవేశం చేసాడు.పార్టీ మేధోమథన సమావేశానికి సి పొన్నయన్, దిండిగల్ శ్రీనివాసన్, కెఎ సెంగోట్టయన్ మరియు మాజీ మంత్రులు డి జయకుమార్ వంటి సీనియర్ ఆఫీస్ బేరర్లు హాజ‌రు అయ్యారు. ఇది ఏకైక నాయకుడి డిమాండ్‌ను పరిశీలిస్తుందని భావిస్తున్నారు. కోర్టు ఆదేశం ఏక నాయకత్వ సమస్యపై ఎలాంటి నిర్ణయాత్మక ఎత్తుగడను ప్రారంభించకుండా EPS శిబిరాన్ని నిరోధించింది. ఈపీఎస్‌కి పన్నీర్‌సెల్వం పుష్పగుచ్ఛం ఇస్తున్నట్లు చూపించే ఒక అద్భుతమైన పోర్ట్రెయిట్ (పాత ఛాయాచిత్రాన్ని ఉపయోగించి) ప్రదర్శించ‌డం హైలెట్ గా నిలిచింది.