Site icon HashtagU Telugu

PM Modi Meditation : కన్యాకుమారిలో రెండు రోజులు ప్రధాని మోడీ మెడిటేషన్

Pm Modi Meditation

Pm Modi Meditation

PM Modi Meditation : లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఈనేపథ్యంలో మే 30వ తేదీన సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీన సాయంత్రం వరకు కన్యా కుమారిలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మెడిటేషన్ చేయబోతున్నారు. ఆ నగరంలోని స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌‌‌లో ఉన్న ధ్యాన మండపంలో మోడీ ధ్యానం చేయనున్నారు. దాదాపు 48 గంటల పాటు ధ్యాన మండపంలోనే ప్రధాని మోడీ గడపనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

కన్యాకుమారి భారతదేశపు దక్షిణ కొన. మన దేశంలోని తూర్పు, పశ్చిమ సముద్ర తీర ప్రాంతాలు కలిసే ప్రదేశమే కన్యాకుమారి. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం జలాలు కన్యాకుమారి వద్ద సంగమిస్తాయి. కన్యాకుమారిలో ధ్యానం చేయడం ద్వారా ప్రధాని మోడీ దేశ సమైక్యతను చాటి చెప్పాలని భావిస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల టైంలో ప్రధాని మోడీ కేదార్‌నాథ్‌ గుహలో ధ్యానం(PM Modi Meditation) చేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. 2014 ఎన్నికల టైంలో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను మోడీ సందర్శించారు.

Also Read :LIC Health Insurance : బీమా రంగంలో సంచలనం.. ‘ఆరోగ్య బీమా’లోకి ఎల్‌ఐసీ

Also Read : Kavitha: కవిత బెయిల్‌ పిటిషన్‌ పై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వు

నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 101వ వర్ధంతి సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఎన్టీఆర్ దార్శనికత కలిగిన  నాయకుడు అని ఆయన కొనియాడారు. తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్ విశిష్ట సేవలు అందించారని చెప్పారు.  తెలుగు జాతితో పాటు యావత్ దేశం ఎన్టీఆర్ సేవలను మరువ లేదన్నారు.

Also Read : Sonipat: సోనిపట్‌లోని రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది దహనం