Site icon HashtagU Telugu

Kantara’s Movie Effect: కాంతారా మూవీ ఎఫెక్ట్.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Kantara 2

Kantara

కర్ణాటక ప్రభుత్వం దైవ నర్తకులకు నెలవారీ భృతి ఇవ్వనున్నట్లు లోక్‌సభ సభ్యుడు, పీసీ మోహన్ వెల్లడించారు. రిషబ్ శెట్టి కాంతారా భూత కోలాను హైలైట్ చేశారని కొనియాడారు. రిషబ్ శెట్టి నటించిన కాంతారా సెప్టెంబర్ 30న రిలీజ్ అయింది. కర్ణాటకలో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ప్రభావంతో 60 ఏళ్లు పైబడిన దైవ నర్తకులకు కర్ణాటక ప్రభుత్వం నెలకు రూ.2000 చొప్పున భృతి ఇవ్వడానికి సిద్ధమవుతోందని బీజేపీ ఎంపీ పీసీ మోహన్ గురువారం ప్రకటించారు. కాంతారా సినిమాను ప్రశంసించారు.

“దైవాలను ఆరాధించడం, నృత్యం, దైవిక జోక్యం. BJP నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన ‘దైవ నర్తకుల’ కోసం రూ. 2,000 నెలవారీ భత్యాన్ని ప్రకటించింది. కాంతారా చిత్రంలో చిత్రీకరించబడిన ఆత్మ ఆరాధనలో భూత కోలా ఒక భాగం” అని ఆయన ట్విట్టర్‌లో రాశారు. కాంతారా ఒక యాక్షన్-థ్రిల్లర్ మూవీ. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించారు. ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.171 కోట్లు వసూలు చేసింది.

యష్ నేతృత్వంలోని KGF ఫ్రాంచైజీ వెనుక బ్యానర్ అయిన హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిర్గందూర్ ఈ బ్లాక్‌బస్టర్‌ను నిర్మించారు. కాంతారా సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ కథ అదరగొట్టడంతో విడుదల అయినా అన్ని బాషలలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాంతారా సినిమా ప్రేక్షకులనే కాకుండా ప్రముఖులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం అన్ని వర్గాల నుండి, ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి విపరీతమైన ఆదరణను పొందుతుంది. కాంతారా చిత్రంలో చిత్రీకరించబడిన ఆత్మ పూజా ఆచారం ప్రాచీనమైనది. కాంతారావు పురాణ కథతో శాండల్‌వుడ్ పరిశ్రమ పీక్స్‌కి చేరుకుంది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీసును షేక్ చేస్తోంది.