Siddaramaiah: జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్లి పూజలుచేస్తాం: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

  • Written By:
  • Updated On - January 12, 2024 / 03:18 PM IST

Siddaramaiah: జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్లి పూజలు చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శుక్రవారం షిమోగా విమానాశ్రయంలో సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని నిర్మించి బీజేపీ రాజకీయాలు చేయబోతోందన్నారు. బీజేపీ దేవుడిని రాజకీయంగా వాడుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, రామచంద్రకు వ్యతిరేకం కాదు. జనవరి 22 తర్వాత తాను అయోధ్యను సందర్శిస్తానని చెప్పారు. మా కార్యకర్తలు కూడా రాష్ట్రం మొత్తం గుడికి వెళ్లి పూజలు చేస్తున్నారు. దేవుడిని వాడుకుని బీజేపీ చేస్తున్న రాజకీయాలకు మేం వ్యతిరేకం అన్నారు. ముగ్గురు డిసిఎంల స్థానంపై ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధులకు సమాధానం ఇవ్వడానికి ముఖ్యమంత్రి నిరాకరించారు.

ఎవరి సొమ్మునో, హామీల పథకాలు అంటూ సంబరాలు చేసుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన విమర్శలపై స్పందించిన ముఖ్యమంత్రులు.. కుమారస్వామి అంటే అబద్ధాలు, అబద్ధాలు అంటే కుమారస్వామి అని సీఎం అన్నారు. ఆయన విమర్శలకు నేను సమాధానం చెప్పను. హామీ పథకాలపై విపక్ష నేతల విమర్శలపై ఆయన స్పందిస్తూ.. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి హామీలు ఇవ్వని విపక్షాలకు ఈ పథకాలు మింగుడుపడవని అన్నారు.

కాగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆడియో సందేశం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి 11 రోజులపాటు “అనుస్థాన్”(ప్రత్యేక జపం) పాటించనున్నట్లు తెలిపారు. “అయోధ్య బాలరాముడి ప్రారంభోత్సవం శుభపరిణామం. ఆరోజు చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవబోతోంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నా సమక్షంలో జరగడం.. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చడానికి భగవంతుడు నన్ను పుట్టించినట్లుగా భావిస్తున్నాను. అందుకే శుక్రవారం నుంచి 11 రోజులపాటు అనుస్థాన్ చేయడానికి నిర్ణయించుకున్నాను. ఈ ఘట్టం నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది. నా జీవితంలో తొలిసారి ఇలాంటి అనుభూతిపొందుతున్నాను. అయోధ్య ప్రారంభోత్సవం ప్రపంచమంతటికీ పవిత్రమైన సందర్భం. రాముడిపై అన్ని ప్రాంతాల్లో భక్తిభావం పొంగి పొర్లుతుంది” అని ఆడియోలో చెప్పారు.