Site icon HashtagU Telugu

Hijab Row: క‌ర్నాట‌క‌ను ఊపేస్తున్న హిజాబ్ వివాదం.. స్పందించిన మ‌లాలా యూసుఫ్ జాయ్

Hija Malala

Hija Malala

క‌ర్నాట‌క రాష్ట్రంలో హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలి వాన‌లా మారి, అక్క‌డ‌ హింసాత్మక ఘటనలకు దారితీస్తుంది. దీంతో కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం రోజు రోజుకు ముదురుతున్న నేప‌ధ్యంలో, అక్క‌డి రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. ఈ క్ర‌మంలో తాజాగా ముఖ్యమంత్రి బొమ్మై స్వయంగా జోక్యం చేసుకుని సెలవులు ప్రకటించారు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే తాజాగా హిజాబ్ వివాదం పై ఉద్యమకారిణి, బాలల హక్కుల కార్యకర్త, నోబెల్​ గ్రహీత మలాలా స్పందించారు.

హిజాబ్‌తో విద్యార్థినులను అనుమతించకపోవడం భయానక చర్యగా పేర్కొన్న మలాల‌, విద్యార్ధినుల‌ను హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లనివ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు. చదువు, హిజాబ్‌లో ఏది ఎంచుకోవాలో కళాశాలు మమ్మల్ని బలవంతం చేస్తున్నాయంటూ విద్యార్థిణిలు ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణమైన చ‌ర్య అని, భారత నాయకులు ముస్లిం మహిళలను చిన్నచూపు చూస్తున్నార‌ని మాలాల అన్నారు. ఇక‌పోతే ఉడిపి జిల్లా కేంద్రంలో హిజాబ్​ ధరించిన విద్యార్ధినుల‌ను ప్ర‌భుత్వ బాలిక‌ల కళాశాల‌లో అనుమ‌తించ‌క పోవ‌డంతో ఈ వివాదం తొలిసారిగా వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Exit mobile version