కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో అత్యాచార ఘటనలపై కేఆర్ రమేష్ కుమార్ దారుణమైన, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు రమేష్ కుమార్ మాట్లాడుతూ, ‘‘అత్యాచారం అనివార్యమైనప్పుడు పడుకుని ఆనందించండి’’ అని ఓ సామెత ఉందని వ్యాఖ్యానించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేష్ కుమార్ గతంలో సభకు స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీలో సమయం నిరాకరించడంతో సదరు నేత ఈ వ్యాఖ్యలు చేశారు. అలంటి అసభ్యకరమైన వ్యాఖ్యలును సభలోని ఇతర నాయకులు ఖండించకుండా.. స్పీకర్ తో సహా ఇతర సభ్యులు నవ్వడం విశేషం.
ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన పార్టీ మహిళా సభ్యులతో సహా పలువురు శాసనసభ్యులు సెషన్‌లో నిరసన తెలిపి, ఖండించారు. దేశంలో ఇప్పటికీ కూడా మహిళా ద్వేషపూరిత ప్రజా ప్రతినిధులు ఉండటం దురదృష్టకరం అని జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
కేఆర్ రమేశ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా విమర్శించారు.
“అత్యాచారం అనివార్యమైతే.. ఆనందించాలి అని అసెంబ్లీ లో ఓ కాంగ్రెస్ నేత మహిళల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని ఉత్తర్ప్రదేశ్లో మహిళా సాధికారత గురించి మాట్లాడే ముందు.. కాంగ్రెస్ తమ నేతను సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు.

