Site icon HashtagU Telugu

Software Employee Murdered : తెలంగాణలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్య..!

Murder Money Software Job Employee

Murder

అప్పు ఇచ్చిన వ్యక్తి.. ఆ డబ్బు (Money) తిరిగి అడుగుతున్నాడనే కక్షతో అతడిని పాశవికంగా హత్య (Murder) చేయించిన దారుణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌ పంచాయతీలోని శాంతినగర్‌కు చెందిన భాజపా మండల అధ్యక్షుడు ధారావత్‌ బాలాజీ పెద్ద కుమారుడు ధారావత్‌ అశోక్‌కుమార్‌ (24) ఖమ్మంలోని ఐటీ కంపెనీలో (IT Company) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం (Software Job) చేస్తున్నాడు. ఇతనికి భార్య అమల, రెండు నెలల పాప ఉన్నారు.

ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌కు చెందిన గుగులోత్‌ ప్రేమ్‌కుమార్‌కు అవసరమైనప్పుడు అశోక్‌ అప్పు ఇచ్చేవాడు. అలా ప్రేమ్‌కుమార్‌ రూ.80 వేల వరకు బాకీ ఉన్నట్లు తెలిసింది. అతడి మధ్యవర్తిత్వంతో మరో వ్యక్తికి కూడా అశోక్‌ అప్పు ఇచ్చినట్లు సమాచారం. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అశోక్‌ ఇద్దరినీ అడుగుతుండటంతో వారు కక్ష పెంచుకున్నట్లు సమాచారం. శనివారం రాత్రి డబ్బులిస్తానని ప్రేమ్‌కుమార్‌ చెప్పడంతో అశోక్‌ తన ద్విచక్ర వాహనంపై ముత్యాలంపాడు క్రాస్‌రోడ్‌కు చేరుకున్నాడు. నిందితులు పథకం ప్రకారం అశోక్‌ను స్థానిక పంచాయతీ కార్యాలయంలోకి తీసుకువెళ్లి గొంతు, చేతిమణికట్లు, కాలి చీలమండల నరాలు కోసి పాశవికంగా హత్య (Murder) చేశారు.

తెల్లవారినా అశోక్‌ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. స్థానికుల సమాచారం మేరకు ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. బాలాజీ ఫిర్యాదుపై టేకులపల్లి సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేశారు. ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అశోక్‌ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రేమ్‌కుమార్‌ ఇంటిపై దాడి చేశారు. పోలీసులు వారిని శాంతింపజేశారు. హత్య (Murder) చేసింది గంజాయి బ్యాచ్‌ పని అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెం, ఖమ్మంకు చెందిన వారితోనే హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read:  3 Arrested : ఐఏఎస్ అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాళ్లు