జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా కాంచీపురం జిల్లాలో జరిగిన ఒక విషాద ఘటనలో రవి (55) అనే వ్యక్తి గుడ్డు తింటూ ప్రాణాలు కోల్పోయాడు. భవన నిర్మాణ కార్మికుడైన రవి రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్డును మింగడానికి ప్రయత్నించగా అది గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస ఆడక రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకున్న మరో దారుణ ఘటనలో సబ్బవరం మండలంలోని బంజరి వద్ద ఒక గర్భిణిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేసి ఆపై కాల్చివేశారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా పరిశీలించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లతో తనిఖీలు చేపట్టారు. మృతి చెందిన గర్భిణి వయస్సు 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారు.
Coolie Review: మెప్పించే యాక్షన్ థ్రిల్లర్
పోలీసుల దర్యాప్తులో హత్యకు గురైన గర్భిణికి తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మృతురాలి భర్త లేదా కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారా, లేక బయటి వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన సమాజంలో భద్రతపై ఆందోళన పెంచుతోంది. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను త్వరగా పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.