Site icon HashtagU Telugu

Crime : భార్యపై అనుమానంతో 8ఏళ్ల కూతురిని దారుణంగా చంపిన తండ్రి..!!

USA

USA

తమిళనాడులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన 8ఏళ్ల కూతురును దారుణంగా హత్య చేశాడు. బకెట్ లో కుక్కి గడివాములో దాచిపెట్టాడు. ఈ విషయం 45 రోజుల తర్వాత బయటకు పొక్కడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ముధురై నగరంలోని జైహింద్ పురంలో నిందితుడు అతని భార్య కూతురుతో కలిసి నివసిస్తున్నారు. కాళీముత్తు స్థానిక టైలరింగ్ షాపులో…అతని భార్య పాత్రల దుకాణంలో పనిచేస్తున్నారు. వీరి కూతురు తన్షికకు కాళీముత్తు బైటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత నుంచి చిన్నారి కనిపించకుండాపోయింది. దీంతో పాప గురించి భర్తను భార్య అడగడంతో..తన చెల్లెలు ఇంట్లో ఉంచానన్ని చెప్పాడు. సెప్టెంబర్ 23న అతని ఇంటి ముందుకు దుర్వాసన రావడంతో స్థానికులు జైహింద్ పురం పోలీసులకు సమాచారం అందించారు. బాలికను హత్య చేసి బకెట్ లో శవాన్ని కుక్కి గడ్డివాములో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

పాపను హత్య చేసిన రోజు నుంచి కాళీముత్తు పరారీలో ఉన్నాడు. అతనికి భార్యమీద అనుమానం ఉండేదని…వీరిద్దర మధ్య తరచుగా గొడవలు జరగుతుండేవని పోలీసులు విచారణలో తేలింది. ఆదిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. భార్యభర్తల మధ్య జరిగే గొడవలు తమ కూతురికి కాళీముత్తు చెప్పుకునేవాడని…ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందామని వెళ్లారని…మొదట కూతురును గొంతకోసి హత్య చేశాడు. బకెట్ లో శవాన్ని పెట్టి అతను రైల్వే ట్రాప్ దగ్గరకు ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లాడని..అక్కడ మనస్సు మార్చుకుని ఆత్మహత్య ప్రయత్నం మానుకున్నాడని పోలీసులు తెలిపారు.

Exit mobile version