Karnataka Elections: క‌ర్నాట‌క ఎన్నిక‌ల బ‌రిలో బిచ్చగాడు.. భిక్షాటనతో నామినేషన్!

ఓ బిచ్చగాడు (Beggar) సైతం ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు

  • Written By:
  • Updated On - April 21, 2023 / 11:03 AM IST

కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి. సీఎం (CM) బొమ్మైకు కిచ్చా సుదీప్ సపోర్ట్ ఇవ్వగా, కాంగ్రెస్ 90 ఏళ్ల వ్యక్తి టికెట్ ఇచ్చి బరిలో దింపింది. తాజాగా ఓ బిచ్చగాడు (Beggar) సైతం బరిలో నిలుస్తున్నాడు. క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో ఓ యాచ‌కుడు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నాడు.

నామినేష‌న్ నిమిత్తం చెల్లించాల్సిన మొత్తం రూ.10 వేలు అధికారుల‌కు అంద‌జేశాడు. ఈ మొత్తాన్ని సేక‌రించేందుకు అత‌ను ఎన్నిక‌ల తేదీ ప్ర‌క‌టించిన నాటినుంచి యాద‌గిరి (Yadagiri) నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతూ భిక్షాట‌న చేశాడు. అలా భిక్ష‌మెత్తుకోగా వ‌చ్చిన చిల్ల‌ర మొత్తాన్నే ఎన్నిక‌ల అధికారుల‌కు నామినేష‌న్ నిమిత్తం చెల్లించాడు. రెండు గంట‌ల పాటు శ్ర‌మించి ఆ మొత్తాన్ని లెక్కించిన అధికారులు అత‌ని (Beggar) నామినేష‌న్ స్వీక‌రించిన‌ట్టు తెలిపారు.

యాద‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల (Election) బ‌రిలో నిలిచిన యాచ‌కుడి పేరు యాచ‌ప్ప‌. అత‌ను యాద‌గిరి ప‌ట్ట‌ణంలో ఉంటాడు. ప‌గ‌లంతా యాచ‌న చేసి క‌డుపు నింపుకుంటాడు. రాత్రిళ్లు ఆల‌య ప్రాంగ‌ణాల్లో నిద్రిస్తుంటాడు. నామినేష‌న్ (Nomination) సంద‌ర్భంగా అత‌ను మాట్లాడుతూ.. తాను అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎందుకు పోటీ చేస్తున్నానో ప్ర‌జ‌ల‌కు చెప్పే నామినేష‌న్‌కు అవ‌స‌ర‌మైన మొత్తాన్ని యాచించాన‌ని (Beggar) చెప్పడం గ‌మ‌నార్హం.