Chennai Cab Driver : చెన్నై క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ అకౌంట్‌లో రూ.9000 కోట్ల డిపాజిట్‌.. కాని కాసేప‌టికే..!

చెన్నైలో ఓ క్యాబ్ డ్రైవ‌ర్ బ్యాంక్ ఖాత‌లో వేల కోట్ల రూపాయ‌లు డిపాజిట్ అయ్యాయి. దీంతో ఒక్క‌సారిగా క్యాబ్ డ్రైవ‌ర్

  • Written By:
  • Publish Date - September 21, 2023 / 01:38 PM IST

చెన్నైలో ఓ క్యాబ్ డ్రైవ‌ర్ బ్యాంక్ ఖాత‌లో వేల కోట్ల రూపాయ‌లు డిపాజిట్ అయ్యాయి. దీంతో ఒక్క‌సారిగా క్యాబ్ డ్రైవ‌ర్ కంగుతిన్నాడు. త‌న‌కు ఓ మేసేజ్ ద్వారా ఈ డ‌బ్బులు డిపాజిట్ అయిన‌ట్లు వ‌చ్చింది. అయితే అది ఫేక్ మేసేజ్ అనుకున్న‌ప్ప‌టికి త‌న అకౌంట్‌లో చెక్ చేయ‌గా నిజంగానే డ‌బ్బులు డిపాజిట్ అయ్యాయి. ఇవి ఎక్క‌డి నుంచి వ‌చ్చాయే తెలియ‌క క్యాబ్ డ్రైవ‌ర్ అయోమ‌యంలో ప‌డ్డాడు. త‌మిళనాడులోని పళనికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్య‌క్తి డ‌బ్బులు డిపాజిట్ చేయ‌గా అవి చెన్నైలోని క్యాబ్ డ్రైవ‌ర్ రాజ్‌కుమార్ ఖాతాలోకి చేరాయి. సెప్టెంబరు 9న ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్ ద్వారా తన బ్యాంకు ఖాతాలో భారీగా డిపాజిట్ అయిన‌ట్లు డ్రైవ‌ర్ గుర్తించాడు. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ద్వారా రూ.9,000 కోట్లు అతని ఖాతాలో జమ అయినట్లు ఆ సందేశంలో ఉంది. రాజ్‌కుమార్ తన స్నేహితుడికి 21,000 రూపాయల చిన్న మొత్తాన్ని బదిలీ చేసిన స‌మ‌యంలో బ్యాలెన్స్ చూపించ‌గా నిజంగానే డ‌బ్బులు జ‌మ అయ్యాయ‌ని భావించాడు. అయితే బ్యాంక్ తన ఖాతా నుండి మొత్తం మొత్తాన్ని డెబిట్ చేయడంతో ఆ ఆనందం కొద్దిసేపే నిలిచింది. అకౌంట్ నెంబ‌ర్ త‌ప్పుగా ఎంట‌ర్ చేయ‌డంతో క్యాబ్ డ్రైవ‌ర్ అకౌంట్‌లోకి డ‌బ్బులు జ‌మ అయిన‌ట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. వెంట‌నే చెక్ చేసి మొత్తాన్ని బ్యాంక్ అధికారులు వెనక్కి తీసుకున్నారు.