Site icon HashtagU Telugu

Karnataka Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది దుర్మరణం

karnataka accident

karnataka accident

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మందిని బలితీసుకుంది. టెంపో ట్రావెలర్, పాల వాహనం ఢీకొన్న 9 మంది మృతి చెందారు. అర్సికెరె తాలుకా పరిధిలోని గాంధీనగర్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులు తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి 11 గంటల తర్వాత ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మిల్క్ ట్యాంకర్, టెంపో ట్రావెలర్ మాత్రమే కాకుండా… ఆర్టీసీ బస్సు కూడా ప్రమాదానికి గురైనట్టు చెప్పారు. అయితే టెంపో ట్రావెలర్ లో ప్రయాణిస్తున్న వారే మృతి చెందినట్టు తెలుస్తోంది.. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ముగ్గురు ఆస్పత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 10 మందికి హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. హాసన్ జిల్లా ఎస్పీ హరీరామ్ శంకర్ ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సమీపంలో స్థానికులను విచారిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో ప్రమాదం రికార్డయిందేమోనని పరిశీలిస్తున్నారు.
టెంపో ట్రావెలర్, పాల వాహనం ఢీకొన్న 9 మంది మృతి చెందారు. అర్సికెరె తాలుకా పరిధిలోని గాంధీనగర్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులు తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి 11 గంటల తర్వాత ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మిల్క్ ట్యాంకర్, టెంపో ట్రావెలర్ మాత్రమే కాకుండా… ఆర్టీసీ బస్సు కూడా ప్రమాదానికి గురైనట్టు చెప్పారు. అయితే టెంపో ట్రావెలర్ లో ప్రయాణిస్తున్న వారే మృతి చెందినట్టు తెలుస్తోంది.. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ముగ్గురు ఆస్పత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 10 మందికి హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. హాసన్ జిల్లా ఎస్పీ హరీరామ్ శంకర్ ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సమీపంలో స్థానికులను విచారిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో ప్రమాదం రికార్డయిందేమోనని పరిశీలిస్తున్నారు.