Site icon HashtagU Telugu

Karnataka Road Accident: క‌ర్ణాట‌క‌లోని ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 9 మంది మృతి, 15 మందికి గాయాలు

Accident Imresizer

Accident Imresizer

గురువారం తెల్లవారుజామున కలంబెల్లా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగింది. ప్రయాణీకుల వాహనాన్ని లారీ ఢీకొట్టింది. మృతులు రాయచూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన దినసరి కూలీలుగా బెంగళూరుకు వెళ్తున్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు ప్రయాణిస్తున్న “క్రూజర్” (మల్టీ యుటిలిటీ వాహనం) దాదాపు ఇరవై నాలుగు మంది ప్రయాణికులతో రద్దీగా ఉందని, మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ప‌లువురు తెలిపారు.

“వారు నిన్న మధ్యాహ్నం 1 గంటలకు క్రూయిజర్‌లో బయలుదేరారు…గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు వాహనం లారీని ఓవర్‌టేక్ చేసినప్పుడు, లారీ వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టడంతో అది పల్టీలు కొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు, మిగిలిన 15 మందిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అందులో గాయాలైన‌వాళ్ల‌ను బెంగళూరులోని నిమ్హాన్స్‌కు పంపినట్లు తుమకూరు డిప్యూటీ కమిషనర్ వై ఎస్ పాటిల్ తెలిపారు.