Site icon HashtagU Telugu

TN Vaccines: త‌మిళ‌నాడులో టీనేజ‌ర్ల‌కు 80 శాతం ఫ‌స్ట్ డోస్ వ్యాక్సిన్ పూర్తి

Vaccine

Vaccine

తమిళనాడు దాదాపు 80 శాతం మంది 15-18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు మొద‌టి డోస్ వ్యాక్సిన్‌ను అందించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కౌమారదశలో ఉన్నవారికి వ్యాక్సిన్‌ను వేసేందుకు కసరత్తు ప్రారంభించిందని, ఇప్పటి వరకు 4.88 లక్షల మంది వ్యాక్సిన్ స్వీకరించారని మంత్రి తెలిపారు.
15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి టీకాలు వేయడం జనవరి 3 నుండి ప్రారంభమైంది. 33.46 లక్షల మంది ప్రజలు డోస్ పొందేందుకు అర్హులు. ఇప్పటి వరకు, 26,61,866 మందికి (80 శాతం) మొదటి డోస్ వచ్చిందని ఇక్కడ 21వ మెగా టీకా శిబిరాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి సుబ్ర‌మ‌ణియ‌న్ తెలిపారు. తాము100 శాతం టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయ‌న తెలిపారు.

రెండవ డోస్ వేసుకున్న వారికి తొమ్మిది నెలలు పూర్తయిన ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, అర్హత ఉన్న వ్యక్తులకు ఆరోగ్య శాఖ ముందుజాగ్రత్తగా బూస్టర్ డోస్ ను అందజేస్తోందని సుబ్రమణియన్ తెలిపారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించిన ‘ఇన్నుయిర్ కప్పోం’ అనే అత్యవసర ఆరోగ్య సంరక్షణ పథకం గురించి ప్రస్తావిస్తూ, ఇందులో ప్రమాదాలలో గాయపడిన వారి ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఇప్పటి వరకు 13,636 మంది లబ్ధి పొందారని చెప్పారు. ఈ పథకంతో అనుసంధానించబడిన ప్రస్తుతమున్న 600 ఆసుపత్రులకు అదనంగా మరో 60 ప్రైవేట్ ఆసుపత్రులను చేర్చినట్లు ఆయన తెలిపారు.