Site icon HashtagU Telugu

Karnataka New Ministers : కర్ణాటకలో కాబోయే మంత్రులు వీరే

Karnataka Congress

Karnataka Congress

ఇంకొన్ని గంటల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య సీఎంగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేయనున్నారు . వీరితో పాటు 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా(Karnataka New Ministers) ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. అయితే ఆ 8 మంది ఎవరు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇందులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గం వారికి సమ ప్రాధాన్యం ఉండేలా బ్యాలెన్స్ ను పాటించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది .

also read : Siddaramaiah: నేడు సిద్ధరామయ్య, శివకుమార్‌ ప్రమాణస్వీకారం.. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కార్యక్రమం..!

ఈక్రమంలో ఇవాళ మంత్రులుగా(Karnataka New Ministers) ప్రమాణం చేయనున్న వారిలో లక్ష్మణ్ సావడి, కెహెచ్ పాటిల్, ఎంబీ పాటిల్ (లింగాయత్), ప్రియాంక్ ఖర్గే (మల్లికార్జున ఖర్గే కుమారుడు), మహదేవప్ప, మునియప్ప (ఎస్‌సీ), రమేష్ జార్కిహోళి (వాల్మీకి), ఆర్‌వీ దేశ్‌పాండే (బ్రాహ్మణ), యుటీ ఖాదర్ (ముస్లిం), తన్వీర్‌ సేఠ్ (ముస్లిం) ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మంత్రుల లిస్టులో బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో పోటీ చేసి ఓడిపోయిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ రాజ్యసభ సభ్యుడు హరిప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప కూడా మంత్రి పదవులు కోసం ఆశపడుతున్నారని తెలుస్తోంది. ఇంకొన్ని గంటల్లో దీనిపై క్లారిటీ వచ్చేస్తుంది.