Site icon HashtagU Telugu

Hijab Row: హిజాబ్ వివాదం.. ఆరుగురు సస్పెన్షన్.. 12 మందిని ఇళ్లకు పంపిన వైనం!!

Hijab Row 7 Teachers Suspended

Hijab Row 7 Teachers Suspended

కర్ణాటక లో మరోసారి హిజాబ్ అంశం వార్తలకు ఎక్కింది. దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ఉప్పినాంగడి ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాలకు హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను సస్పెండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి, హిజాబ్ ధరించే విద్యార్థులను తరగతుల్లోకి పంపలేమని కళాశాల ప్రిన్సిపాల్ ఇటీవల స్పష్టం చేశారు.

అయినా ఆ సూచనలను పట్టించుకోకుండా ఆరుగురు విద్యార్థినులు హిజాబ్ ధరించి గురువారం కాలేజీకి రావడంతో.. వారిపై సస్పెన్షన్ వేటు విధించారు. ఈమేరకు కళాశాల అధ్యాపకుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు మంగళూరు యూనివర్సిటీ కాలేజీకి చెందిన 16 మంది విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతి గదుల్లోకి వెళ్ళేటందుకు యత్నించారు. అయితే వారిని కళాశాల నిర్వాహకులు అడ్డుకున్నారు.దీనిపై ఆ విద్యార్థినులు జిల్లా కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఆయన కూడా వారికి కౌన్సెలింగ్ చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. అయినా విద్యార్థినులు మరోసారి హిజాబ్ ధరించి కాలేజీకి వెళ్లారు. తరగతి గదుల్లోకి హిజాబ్ తో ప్రవేశించే యత్నం చేశారు. దీంతో కళాశాల నిర్వాహకులు వారిని అడ్డుకొని ఇళ్లకు పంపించేశారు.